యోధులుగా రాబోతున్న దుల్కర్‌.. ధనుష్‌ - dulquer and dhanush new movies first looks
close
Updated : 28/07/2020 21:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యోధులుగా రాబోతున్న దుల్కర్‌.. ధనుష్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు దుల్కర్‌ సల్మాన్‌. కీర్తి సురేశ్‌ ప్రధాన పాత్రలో, నిర్మాత ప్రియాంక దత్‌ ప్రొడక్షన్‌ అయిన స్వప్న సినిమా నిర్మించిన ఈ చిత్రంలో జెమిని గణేశ్‌ పాత్రకు దుల్కర్‌ ప్రాణం పోశాడు. ఇప్పుడు అదే నిర్మాణ సంస్థలో మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి ‘అందాల రాక్షసి’ ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ఫేమ్‌ హను రాఘవపూడి దర్శకుడు. విశాల్‌ చంద్రశేఖరన్‌ సంగీతం అందిస్తున్నారు. ఇవాళ దుల్కర్‌ పుట్టిన రోజు సందర్భంగా  కొత్త సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం సోషల్‌మీడియాలో విడుదల చేసింది. ‘లెఫ్టినెంట్‌’ రామ్‌ ‘యుద్ధంతో’ రాసిన ప్రేమకథ అని పోస్టర్‌పై రాశారు. టైటిల్‌ ఇదేనా.. లేదా వేరే పెడతారా అనేది తెలియాల్సి ఉంది. దీని బట్టి ఈ చిత్రం యుద్ధం, ప్రేమ నేపథ్యంలో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇందులో దుల్కర్‌ లెఫ్టినెంట్‌ రామ్‌గా కనిపించబోతున్నాడు. తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో ఈ చిత్రం రాబోతుంది.

యోధుడిగా ధనుష్‌?

తమిళ సినిమాలతోనే తెలుగు ప్రేక్షకులకు మెప్పిస్తోన్న నటుడు ధనుష్‌. ఇవాళ అతడి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ధనుష్‌ నటిస్తున్న తాజా సినిమా ‘కర్ణన్‌’కు సంబంధించి ప్రీలుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. మారి సెల్వరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కలైపులి ఎస్‌. థాను నిర్మాత. సంతోష్‌నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో ధనుష్‌ యోధుడిగా కనిపించబోతున్నట్లు సమాచారం. త్వరలో ధనుష్‌ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తారట.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని