తాజా దివాలా ప్రక్రియపై నిషేధం మరో 3 నెలలు
close
Published : 25/09/2020 00:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తాజా దివాలా ప్రక్రియపై నిషేధం మరో 3 నెలలు

దిల్లీ: దివాలా చట్టం కింద తాజాగా దివాలా ప్రక్రియను చేపట్టడంపై మరో మూడు నెలల పాటు నిషేధాన్ని కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో దివాలా స్మృతి(ఐబీసీ) కింద తాజా ప్రక్రియలను మొదలుపెట్టడంపై మార్చి 25 నుంచి ఆరు నెలల పాటు నిషేధం విధించింది. ఆ గడువు గురువారంతో ముగిసింది. కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం.. శుక్రవారం మొదలు మరో మూడు నెలలు ఈ నిషేధం కొనసాగుతుంది. తాజా దివాలా ప్రక్రియలపై నిషేధం విధించాలని ప్రభుత్వం అంతక్రితమే ఆర్డినెన్స్‌ను తీసుకురాగా.. మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ మొదలైన రోజు నుంచే అమల్లోకి వచ్చింది. కాగా, ఐబీసీకి సవరణలు చేసిన ఆర్డినెన్స్‌ స్థానంలో తీసుకొచ్చిన బిల్లుకు గత శుక్రవారం పార్లమెంటు ఆమోద ముద్ర వేసింది. కరోనా ఒత్తిళ్లలో ఉన్న కంపెనీలకు ఊరటనివ్వడానికి ఐబీసీలోని సెక్షన్‌ 7,9, 10లను మంత్రిత్వశాఖ రద్దు చేసింది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని