విడుదలకు సిద్ధమైన పటాస్‌
close
Updated : 08/01/2020 08:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విడుదలకు సిద్ధమైన పటాస్‌

‘పటాస్‌’లో ధనుష్‌, స్నేహ

కోడంబాక్కం, న్యూస్‌టుడే: ‘కొడి’ చిత్రం తర్వాత దురై సెంథిల్‌కుమార్‌ దర్శకత్వంలో ధనుష్‌ మళ్లీ నటిస్తున్న చిత్రం ‘పటాస్‌’. ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. స్నేహ, మెహరీన్‌ కథానాయికలు. సత్యజ్యోతి ఫిలిమ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ‘పుదుపేట్ట’ చిత్రం తర్వాత ధనుష్‌, స్నేహ కలిసి నటిస్తున్న చిత్రమిది. సంక్రాంతి కానుకగా ఈ నెల 16న ఈ సినిమా విడుదల కానుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వ్యాపార పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వివేక్‌ మెర్విన్‌ సంగీతం సమకూర్చారు. ఓం ప్రకాశ్‌ సినిమాటో గ్రాఫర్‌గా వ్యవహరించారు. ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. మాస్‌ అంశాల ప్యాకేజీగా ట్రైలర్‌ను రూపొందించారు. ధనుష్‌ సరదా డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. మార్షల్‌ ఆర్ట్స్‌ తెలిసిన వ్యక్తిగా ధనుష్‌ నటించినట్లు స్పష్టమవుతోంది. ఇదిలా ఉండగా కేరళలో మంచి ఫ్యాన్సీ రేటుకు ఈ సినిమాను విక్రయించినట్లు కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ములకుపడం ఫిలిమ్స్‌ సంస్థ కేరళ హక్కులను సొంతం చేసుకుంది. ఇటీవల మోహల్‌లాల్‌ హీరోగా ‘పులి మురుగన్‌’ చిత్రాన్ని ఈ సంస్థ నిర్మించింది. అంతేకాకుండా ‘2.ఓ’, ‘విశ్వాసం’, ‘కాప్పాన్‌’ వంటి పెద్ద చిత్రాలను కూడా ఈ సంస్థే విడుదల చేసింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని