బాలయ్య బర్త్‌డే.. చిరు ట్వీట్‌..!
close
Published : 10/06/2020 11:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బాలయ్య బర్త్‌డే.. చిరు ట్వీట్‌..!

సోషల్‌మీడియాలో శుభాకాంక్షల వెల్లువ

హైదరాబాద్‌: తన సహనటుడు, సన్నిహితుడు బాలకృష్ణకు చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇదే ఉత్సాహంతో నిండు నూరేళ్ల సంబరం బాలయ్య జరుపుకోవాలని చిరు ఆకాంక్షించారు. చిరంజీవితోపాటు నందమూరి కుటుంబసభ్యులు, సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్‌మీడియా వేదికగా బాలకృష్ణకు బర్త్‌డే విషెస్‌ తెలిపారు.

‘60లో అడుగుపెడుతోన్న మా బాలకృష్ణకి  షష్టి పూర్తి శుభాకాంక్షలు. ఇదే ఉత్సాహంతో, ఉత్తేజంతో ఆయురారోగ్యాలతో నిండునూరేళ్ల సంబరం కూడా జరుపుకోవాలని, అందరి అభిమానం ఇలాగే పొందాలని కోరుకుంటున్నాను.’ -చిరంజీవి

‘నటనైనా, ప్రజాసేవ అయినా.. చేసే పనిలో నూటికి నూరుపాళ్లు నిబద్ధతతో ఉండే వ్యక్తి బాలకృష్ణగారు. అందుకే ఆయన కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. బాలకృష్ణగారు అరవై వసంతాలు పూర్తి చేసుకున్న శుభసందర్భంలో ఆయనకు షష్టిపూర్తి మహోత్సవ శుభాకాంక్షలు’ -నారా చంద్రబాబు నాయుడు

‘నాలోని అభిమానిని తట్టి లేపింది మీరే.. నాకు ఊహ తెలిశాక చూసిన మొట్టమొదటి హీరో మీరే.. ఈ 60వ పుట్టినరోజు మీ జీవితంలో మరపురానిది కావాలని, మీరు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఐ విష్‌ యూ ఏ వెరీ హ్యాపీ 60 బర్త్‌డే బాబాయ్‌. జై బాలయ్య’ -ఎన్టీఆర్‌

‘మీరు ఎందరికో బాలయ్య.. నాకు మాత్రం తండ్రి తరువాత తండ్రి స్థానంలో ఉండే బాబాయ్. మీ ఆదర్శంతోనే సినిమాల్లోకి వచ్చాను. మీ స్ఫూర్తితోనే కొనసాగుతున్నాను. ఈ 60వ పుట్టిన రోజున మీరు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్‌డే బాబాయ్‌’ -కల్యాణ్‌ రామ్‌

‘ప్రతి ఒక్కర్నీ వినయ విధేయతలతో గౌరవించే గొప్ప వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్‌డే లయన్‌. జై బాలయ్య’ -నారా రోహిత్‌

‘లయన్‌ కింగ్ ఆఫ్‌ తెలుగు సినిమా, నందమూరి నటసింహ బాలకృష్ణ గారికి, ఆ భగవంతుడు నిండు నూరేళ్లు, ఆయురారోగ్యాలు అందజేయాలని కోరుకుంటున్నాను. మీ 60వ బర్త్‌డే మళ్లీ స్వీట్ 16 నుంచి కౌంట్ రీస్టార్ట్. షష్టిపూర్తి జన్మదిన శుభాకాంక్షలు’ -ప్రసాద్‌ వి పొట్లూరిమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని