అజయ్‌ ఆచూకీ కోసం కీర్తి పోరాటం
close
Updated : 11/06/2020 18:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అజయ్‌ ఆచూకీ కోసం కీర్తి పోరాటం

ఆసక్తికరంగా ‘పెంగ్విన్‌’ ట్రైలర్‌

హైదరాబాద్‌: అగ్ర కథానాయిక కీర్తిసురేశ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘పెంగ్విన్‌’. ఈశ్వర్‌ కార్తిక్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అతిత్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘పెంగ్విన్‌’ ట్రైలర్‌ను చిత్రబృందం గురువారం అభిమానులతో పంచుకుంది. తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో రూపుదిద్దుకున్న ఈ ట్రైలర్‌ను నాని, ధనుష్‌, మోహన్‌లాల్‌ సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేశారు. సస్పెన్స్‌, క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్ర ట్రైలర్‌ ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంది. ఇందులో కీర్తి తల్లి పాత్రను పోషించారు. అపహరణకు గురైన తన కుమారుడు అజయ్‌ని ఓ రాక్షసుడి బారి నుంచి కాపాడేందుకు ఆమె చేసే పోరాటం.. ఈ క్రమంలో ఆమె ఎదుర్కొనే సమస్యలను చాలా ఆసక్తికరంగా చూపించారు. వీడియోను షేర్‌ చేసిన కీర్తి.. ‘నమ్మకమే ఓ తల్లికి అతిపెద్ద ఆయుధం’ అని పేర్కొన్నారు.

లాక్‌డౌన్‌ వేళ థియేటర్ల పునఃప్రారంభంపై స్పష్టత రాకపోవడంతో ఓటీటీ వేదికగా ‘పెంగ్విన్‌’ను విడుదల చేయనున్నారు. జూన్‌ 19న అమెజాన్‌ ప్రైమ్‌లో ఇది విడుదల కానుంది. కార్తీకేయన్‌ సంతానం, సుధన్‌ సుందరం, జయరామ్‌ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని