అక్షయ్‌తో వాణి ఆటాపాటా
close
Published : 03/07/2020 12:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అక్షయ్‌తో వాణి ఆటాపాటా

ముంబయి: ప్రముఖ బాలీవుడ్‌ కథానాయకుడు అక్షయ్‌ కుమార్‌కు జోడీగా నటించబోతుంది అందాల తార వాణీ కపూర్‌. అక్షయ్‌ కథానాయకుడిగా తెరకెక్కనున్న చిత్రం ‘బెల్‌ బాటమ్‌’. ఈ చిత్రంలో అక్షయ్‌ సరసన వాణీ నటించబోతున్నట్టు చిత్ర నిర్మాతల్లో ఒకరైన జాకీ భగ్నానీ ప్రకటించారు.

జాకీ మాట్లాడుతూ ‘‘బెల్‌బాటమ్‌’ చిత్ర కథకు అక్షయ్‌ సార్‌ సరసన సరిగ్గా సరిపోయే నాయిక వాణీ. ఆమె గత చిత్రాల్లో నటించిన తీరు నన్ను ఆకట్టుకుంది. ఈ చిత్రంలో ఆమె పాత్ర నటిగా ఆమె నిరూపించుకోవడానికి చక్కటి అవకాశం’’అన్నారు.

‘‘పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నటించడం ఆనందంగా ఉంది. షూటింగ్‌లో ఎప్పుడు పాల్గొంటానా? తెరపై అక్షయ్‌ సార్‌ సరసన నన్ను ఎప్పుడు చూసుకుంటానా? అని ఆత్రుతతో ఉన్నాను’’ అంది వాణీ కపూర్‌. ఈ చిత్రానికి రంజిత్‌ ఎమ్‌ తివారీ దర్శకుడు.

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని