‘‘సెట్‌లో భౌతిక దూరం జరగని పని’’
close
Updated : 09/07/2020 16:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘‘సెట్‌లో భౌతిక దూరం జరగని పని’’

బాలీవుడ్‌ దర్శకులు అనుభవ్‌ సిన్హా

ముంబయి: కరోనా.. లాక్‌డౌన్‌ వల్ల మూడున్నర నెలలుగా సినిమా పరిశ్రమ స్తంభించిపోయింది. సినిమా షూటింగ్స్‌ ఆగిపోయాయి. అయితే ప్రస్తుతం దేశంలో అన్ని కార్యకలాపాలు కొనసాగిస్తుండటంతో త్వరలో సినిమా షూటింగ్స్‌కూ అనుమతి ఇస్తామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వం అనుమతిస్తే... భౌతిక దూరం, కరోనా నిబంధనలు పాటిస్తూ షూటింగ్స్‌ జరుపుకోవాలని సినీ వర్గాలు భావిస్తున్నాయి. కానీ బాలీవుడ్‌ దర్శకుడు అనుభవ్‌ సిన్హా మాత్రం షూటింగ్స్‌కు అనుమతి ఇచ్చినా సినిమా సెట్‌లో భౌతిక దూరం పాటించడం అసాధ్యమంటున్నారు.

‘‘త్వరలో సినిమా షూటింగ్స్‌ ప్రారంభించాలని నేనేం తొందరపడట్లేదు. వచ్చే ఏడాదిన్నర వరకు సినిమా షూటింగ్స్‌ నిదానంగా జరుగుతాయి. అంతేకాదు.. ఇది వరకు షూటింగ్స్‌కు పెట్టే ఖర్చు కన్న ఇప్పుడు 20శాతం ఎక్కువ ఖర్చవుతుంది. ఎందుకంటే షూటింగ్స్‌లో పాల్గొనేవారిందరికి కరోనా నుంచి రక్షణ కల్పించాల్సి ఉంటుంది. ఇందుకోసం మరింత ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇక సినిమా సెట్‌లో  దూరం పాటించడమంటే రెండు విరుద్ధమైన విషయాలను కలిపే ప్రయత్నం చేయడమే. సెట్‌లో భౌతిక దూరం పాటించడమనేది జరగదు.. జరగబోదు. పాటిస్తాం అని చెబితే.. మనకు మనం అబద్ధం చెప్పుకోవడమే అవుతుంది’’అని అనుభవ్‌ అన్నారు. 

తుమ్‌బిన్‌ 1&2, దస్‌, రా.వన్‌, ముల్క్‌, ఆర్టికల్‌ 15 వంటి చిత్రాలు తెరకెక్కించిన దర్శకుడు అనుభవ్‌ సిన్హా.. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన ‘తప్పడ్‌’ చిత్రానికీ దర్శకత్వం వహించారు. మహిళల ఆత్మగౌరవం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలందుకుంది. ఆర్టికల్‌ 15లో నటించిన యువ కథానాయకుడు ఆయుష్మాన్‌ ఖురానాతో మరో సినిమా తీసేందుకు అనుభవ్‌ సిన్హా ప్లాన్‌ చేశారు. విదేశాల్లో చిత్రీకరణ జరపాలని భావించారట. కానీ లాక్‌డౌన్‌ విధించడంతో అది కుదరలేదని, ప్రస్తుతం భారత్‌లోనే చిత్రీకరించేందుకు లోకేషన్లు వెతుకుతున్నట్లు అనుభవ్ తెలిపారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని