close
Published : 01/03/2021 01:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సాయిపల్లవి.. సారంగ దరియా

ఉర్రూతలూగించే డ్యాన్స్‌లకు పెట్టింది పేరు సాయిపల్లవి. ‘ఫిదా’ చిత్రంలోని   ‘‘వచ్చిండే పిల్లా’’ పాటతో.. ఆమెలోని అద్భుత డ్యాన్సర్‌ను సినీప్రియులకు  పరిచయం చేశారు దర్శకుడు శేఖర్‌ కమ్ముల. ఇప్పుడాయన దర్శకత్వంలోనే రూపొందుతోన్న చిత్రం ‘లవ్‌స్టోరీ’.  నాగచైతన్య, సాయిపల్లవి జంటగా   నటిస్తున్నారు. ఏప్రిల్‌ 16న విడుదలవుతోంది. ఇప్పుడీ సినిమాలోనూ ‘‘వచ్చిండే పిల్లా’’ తరహాలో ఓ అదిరిపోయే పాటను సెట్‌ చేశారు శేఖర్‌ కమ్ముల. అదే ‘‘సారంగ దరియా’’. ఈ గీతాన్ని ఆదివారం నటి సమంత ట్విటర్‌ ద్వారా విడుదల చేశారు. హుషారెత్తించే బీట్‌తో సాగుతున్న ఓ చక్కటి తెలంగాణ జానపదమిది. పవన్‌ సి.హెచ్‌     స్వరాలందించారు. ‘‘వచ్చిండే..’’ పాటకి సాహిత్యమిచ్చిన సుద్దాల అశోక్‌ తేజనే.. ఈ గీతాన్నీ రచించారు. దీనికి గాయని మంగ్లీ మ్యాజిక్‌ వాయిస్‌.. శేఖర్‌ మాస్టర్‌ నృత్యరీతులు.. సాయిపల్లవి డ్యాన్స్‌ మూమెంట్్స జత కలవడంతో పాట అందరినీ ఆకట్టుకుంటోంది. శేఖర్‌ కమ్ముల ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ.. ‘‘తెలంగాణ జానపద గీతం ‘సారంగ దరియా’కి సరికొత్త సొగసులద్ది, తనదైన శైలిలో మాకందించిన సుద్దాలకి వేలదండాలు. మాకీ పాట సేకరించి ఇచ్చిన రేలారే కోమలకు, చక్కటి బాణీలు కట్టిన పవన్‌, ఆలపించిన మంగ్లీ, అద్భుతంగా డ్యాన్స్‌ చేసిన సాయి పల్లవి, చేయించిన శేఖర్‌మాస్టర్‌కి థ్యాంక్స్‌’’ అన్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: విజయ్‌ సి.కుమార్‌, నిర్మాతలు: నారాయణ్‌ దాస్‌.కె నారంగ్‌, పి.రామ్‌ మోహన్‌ రావు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని