‘థ్యాంక్‌ యూ’ ముచ్చట
close
Published : 08/05/2021 04:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘థ్యాంక్‌ యూ’ ముచ్చట

నాగచైతన్య - రాశీఖన్నా జోడీ మరోసారి సందడి చేయనుంది ‘థ్యాంక్‌ యూ’ చిత్రంతో! విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నా... ఇటీవలే ఇటలీ వెళ్లిన ఈ బృందం మిలన్‌తోపాటు పలు ప్రాంతాల్లో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించి తిరుగు పయనమయ్యారు. సినిమా సెట్లో నాగచైతన్య, రాశీఖన్నా సరదాగా ఇలా సెల్ఫీ తీసుకున్నారు. రాశి ఈ ఫొటోని సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంది. ‘వెంకీ మామ’ తర్వాత వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రమిది. ‘మనం’ తర్వాత నాగచైతన్య, విక్రమ్‌ కె.కుమార్‌ ‘థ్యాంక్‌ యూ’ కోసం కలిశారు. ఈ చిత్రానికి పీసీ శ్రీరామ్‌ కెమెరా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని