యండమూరి దర్శకత్వంలో..
close
Published : 12/06/2021 02:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యండమూరి దర్శకత్వంలో..

థా రచయితగా.. దర్శకుడిగా సినీ, సాహిత్య ప్రియుల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారు యండమూరి వీరేంద్రనాథ్‌. చాలా కాలం తర్వాత ఆయన మెగాఫోన్‌ పట్టి తెరకెక్కించిన చిత్రం ‘నల్లంచు తెల్లచీర’. భూషణ్‌, దియా, జెన్నీ, సాయి, కిషోర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఊర్వశి ఓటీటీ సమర్పణలో రవి కనగాల, తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. నిర్మాతలు మాట్లాడుతూ ‘‘యండమూరి శైలిలో సాగే వినూత్నమైన కథ, కథనాలతో ఈ చిత్రాన్ని ముస్తాబు చేస్తున్నాం. అందరికీ నచ్చేలా ఉంటుంది. త్వరలో ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ సినిమాకి సంగీతం: తాళ్లూరి నాగరాజు, ఛాయాగ్రహణం: అమీర్‌.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని