సంక్రాంతికి భీమ్లా రిపోర్టింగ్‌
close
Updated : 28/07/2021 09:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సంక్రాంతికి భీమ్లా రిపోర్టింగ్‌

పవన్‌ కల్యాణ్‌, రానా కథానాయకులుగా సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలో ఓ చిత్రం ముస్తాబవుతోంది. మలయాళంలో విజయవంతమైన ‘అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌’ సినిమాకి రీమేక్‌గా రూపొందుతోంది. సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. దర్శకుడు త్రివిక్రమ్‌ మాటలందిస్తున్నారు. కరోనా పరిస్థితులతో ఆగిన ఈ చిత్రం.. తాజాగా పునఃప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఓ చిన్న మేకింగ్‌ వీడియోని విడుదల చేశారు. ఇందులో పవన్‌ పోలీస్‌ గెటప్‌లో కనిపించి అలరించారు. ఈ వీడియోలో కనిపించిన సన్నివేశాలను బట్టి.. ప్రత్యేకంగా వేసిన ఓ పోలీస్‌ స్టేషన్‌ సెట్‌లో ప్రస్తుతం పవన్‌, రానాలపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ సినిమాని 2022 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇందులో పవన్‌.. భీమ్లా నాయక్‌ అనే శక్తిమంతమైన పోలీస్‌ అధికారిగా కనిపించనున్నారు. రానా పాత్ర పేరేంటన్నది తెలియాల్సి ఉంది. ఈ చిత్రానికి తమన్‌ స్వరాలు అందిస్తున్నారు.Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని