RRR: స్నేహానికి చాచిన హస్తం
close
Updated : 02/08/2021 08:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

RRR: స్నేహానికి చాచిన హస్తం

‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లోని  దోస్తీ... పాట విడుదలైంది. స్నేహితుల  దినోత్సవం సందర్భంగా  ఆదివారం సామాజిక మాధ్యమాల ద్వారా పాటని విడుదల చేశారు.

‘పులికి విలుకాడికి

తలకి ఉరితాడుకి

కదిలే కార్చిచ్చుకి...

కసిరే వడగళ్ళకి

రవికి మేఘానికి... దోస్తీ.

ఊహించని చిత్రం విచిత్రం

స్నేహానికి

చాచిన హస్తం  

ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో...’ 

అంటూ సాగే ఈ పాటని సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించారు. కీరవాణి స్వరాలు సమకూర్చగా, హేమచంద్ర ఆలపించారు. తెలుగుతోపాటు, తమిళం, కన్నడ హిందీ, మలయాళంలోనూ ఈ పాట విడుదలైంది. ఈ పాట కోసం ప్రత్యేకంగా ఓ వీడియోని రూపొందించింది చిత్రబృందం. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రేక్షకుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. నిప్పు - నీరు థీమ్‌ ఈ పాటలో హైలెట్‌ అయ్యింది. పాట చివర్లో కథానాయకులు రామ్‌చరణ్‌ - ఎన్టీఆర్‌ చేతులు కలుపుతారు. అగ్ర దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. మిగిలిన పాట కోసం చిత్రబృందం యూరప్‌  బయల్దేరింది. అక్టోబరు 13న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.



Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని