విజయ్‌ - వంశీ పైడిపల్లి.. అధికారికం
close
Published : 27/09/2021 02:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విజయ్‌ - వంశీ పైడిపల్లి.. అధికారికం

‘బృందావనం’, ‘ఊపిరి’, ‘మహర్షి’ వంటి విజయవంతమైన చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ఓ గుర్తింపు సాధించుకున్నారు వంశీ పైడిపల్లి. ఆయన త్వరలో తమిళ అగ్ర కథానాయకుడు విజయ్‌  దళపతితో ఓ సినిమా చేయనున్నట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి. దీనిపై ఆదివారం అధికారిక ప్రకటన వెలువడింది. ఈ ఇద్దరి కలయికలో రూపొందనున్న ఈ ప్రాజెక్ట్‌ను.. దిల్‌రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ చిత్రంపై దర్శకుడు వంశీ పైడిపల్లి స్పందిస్తూ.. ‘‘నా సొంత బ్యానర్‌ లాంటి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ నిర్మాణంలో.. విజయ్‌ హీరోగా సినిమా చేస్తున్నానని తెలియజేస్తున్నందుకు సంతోషంగా ఉంద’’న్నారు. ఇది విజయ్‌ నటించనున్న 66వ చిత్రం. ‘బీస్ట్‌’ సినిమా పూర్తి కాగానే.. ఈ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కనుంది.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని