ఆగస్టులో ఆరంభించబోతున్నారా?
close
Published : 11/06/2020 17:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆగస్టులో ఆరంభించబోతున్నారా?

తెలుగులో మరో మల్టీస్టారర్‌ చిత్రం కోసం రంగం సిద్ధమవుతోంది. ఈసారి రవితేజ - రానా కలిసి నటించబోతున్నారు. మలయాళంలో విజయవంతమైన ‘అయ్యప్పనుమ్‌  కోశియుమ్‌’ చిత్రాన్ని తెలుగులో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ రీమేక్‌ చేయబోతోంది. ఇందులో రవితేజ, రానా కలిసి  నటిస్తారు. ఆగస్టులో చిత్రాన్ని ప్రారంభిస్తారని సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

చిత్రీకరణలకి అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో రూపొందుతున్న ‘అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌’ రీమేక్‌తోపాటు నితిన్‌ ‘రంగ్‌దే’, నాని ‘శ్యామ్‌ సింగరాయ్‌’, నాగశౌర్య - లక్ష్మీ సౌజన్య కలయికలో సినిమాల్ని ఆగస్టులో సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని