బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌లో పవన్‌..  ఫొటో వైరల్‌!
close
Published : 21/01/2020 14:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌లో పవన్‌..  ఫొటో వైరల్‌!

హైదరాబాద్‌: పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ మేకప్‌ వేసుకుని.. మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు. ‘అజ్ఞాతవాసి’ తర్వాత రాజకీయాలతో బిజీ అయిన ఆయన తిరిగి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హిందీ హిట్‌ ‘పింక్‌’ తెలుగు రీమేక్‌లో ఆయన అమితాబ్‌ బచ్చన్‌ పాత్రను పోషిస్తున్నారు. నివేదా థామస్‌, అంజలి, అనన్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. దిల్‌రాజు, బోనీకపూర్‌ నిర్మాతలు. ‘పింక్‌’ కథలో పవన్‌ ఇమేజ్‌కి తగినట్టుగా కొన్ని మార్పులు చేశారట. సోమవారం నుంచి ఈ చిత్రం షూటింగ్‌లో పవన్‌ పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా సెట్‌లో ఆయన ఉండగా తీసిన ఫొటో లీక్‌ అయ్యింది. అందులో పవన్‌ కొత్త లుక్‌లో దర్శనమిచ్చారు. ఈ ఫొటో కాస్త సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం PSPK26 అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్విటర్‌ ట్రెండ్‌ అయ్యింది.

ఇంకా ఈ చిత్రంలో కథానాయిక ఎవరో ప్రకటించలేదు. అయితే పూజాహెగ్డే పేరు వినిపిస్తోంది. ఈ వదంతుల్లో ఏ మాత్రం నిజం ఉందో తెలియాలంటే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ‘పింక్‌’ను ఇప్పటికే తమిళంలో రీమేక్‌ చేశారు. అక్కడ అజిత్‌ కథానాయకుడిగా నటించారు. బోనీ నిర్మించారు. ఈ రీమేక్‌ కూడా మంచి ఆదరణ అందుకోవడంతోపాటు బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబట్టింది.



మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని