బ్రహ్మాజీ కుమారుడు హీరోగా ‘ఓ..పిట్టకథ’
close
Published : 26/01/2020 20:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బ్రహ్మాజీ కుమారుడు హీరోగా ‘ఓ..పిట్టకథ’

పోస్టర్‌ను విడుదల చేసిన త్రివిక్రమ్‌

హైదరాబాద్‌: ప్రముఖ నటుడు బ్రహ్మాజీ కుమారుడు సంజయ్‌ వెండితెరకు పరిచయమవుతోన్న చిత్రం ‘ఓ..పిట్టకథ’. చెందు ముద్దు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఆదివారం ఉదయం విడుదల చేశారు. భవ్య క్రియేషన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ఈ సినిమాలో విశాంత్‌, నిత్య, బ్రహ్మాజీ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

పోస్టర్‌ విడుదల అనంతరం ‘ఓ పిట్టక‌థ‌’ గురించి త్రివిక్రమ్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాతో నాకు మంచి అనుబంధం ఉంది. అదేంటంటే నాకు ఈ క‌థ తెలియ‌డ‌మే. క‌థ విన్నప్పుడు చాలా ఇంట్రస్టింగ్‌గా అనిపించింది. దీనికి ఎలాంటి టైటిల్ ఉంటే బావుంటుంద‌నే డిస్కష‌న్ వ‌చ్చిన‌ప్పుడు, ద‌ర్శకుడు చందు రెండు, మూడు టైటిల్స్ చెప్పారు. అందులో ‘ఓ పిట్టక‌థ’ అనే టైటిల్‌ నాకు చాలా బాగా న‌చ్చింది‌. ‘ఇట్స్ ఎ లాంగ్ స్టోరీ’ అనే క్యాప్ష‌న్ పెట్టమ‌ని స‌ల‌హా ఇచ్చాను. అంత‌వ‌ర‌కే నా కంట్రిబ్యూష‌న్‌. క‌థ న‌చ్చింది. టైటిల్ బావుంది. ప్రేక్షకుల‌కు క‌నెక్ట్ అవుతుంద‌నే న‌మ్మకంతో ఈ టైటిల్ పోస్టర్‌ని రిలీజ్ చేయ‌డానికి ఒప్పుకున్నాను’ అని అన్నారు.మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని