‘బుట్టబొమ్మ..’ ఫుల్‌ వీడియో సాంగ్‌ చూశారా?
close
Published : 26/02/2020 09:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘బుట్టబొమ్మ..’ ఫుల్‌ వీడియో సాంగ్‌ చూశారా?

హైదరాబాద్‌: ‘బుట్టబొమ్మ.. బుట్టబొమ్మ.. నన్ను సుట్టూకుంటువే..’అంటూ థియేటర్‌లో ప్రేక్షకులను ఓ ఊపు ఊపేశారు అల్లు అర్జున్‌-పూజాహెగ్డే. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో బన్ని కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అల్లు అర్జున్‌ నటన, త్రివిక్రమ్‌ టేకింగ్‌, పూజా హెగ్డే అందాలు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ముఖ్యంగా తమన్‌ అందించిన పాటలు నెటిజన్లను ఓ ఊపు ఊపేశాయి. 

‘సామజవరగమన’, ‘బుట్టబొమ్మ’, ‘ఓ మై గాడ్‌ డాడీ’ పాటలు యువతను విశేషంగా అలరించాయి. ఇటీవల ‘సామజవరగమన’, ‘ఓ మై గాడ్‌ డాడీ’ ఫుల్‌ సాంగ్‌లను విడుదల చేసిన చిత్ర బృందం. తాజాగా ‘బుట్టబొమ్మ’ పాటను అభిమానులతో పంచుకుంది. తమన్‌ అందించిన స్వరాలకు రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించగా, అర్మాన్‌ మాలిక్‌ ఆలపించారు. ఇక ఈ పాటకు బన్ని-పూజాలు వేసిన స్టెప్‌లు యువతను విశేషంగా ఆకట్టుకున్నాయి. 




మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని