సారీ బ్రదర్‌.. చెర్రీకి ఎన్టీఆర్‌ ట్వీట్‌
close
Published : 27/03/2020 10:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సారీ బ్రదర్‌.. చెర్రీకి ఎన్టీఆర్‌ ట్వీట్‌

రాజమౌళి సంగతి తెలుసుగా..!

హైదరాబాద్‌: టాలీవుడ్‌ యువ కథానాయకులు మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కలిసి నటిస్తోన్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌ రౌద్రం రణం రుధిరం’. ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్‌ కొమరం భీమ్‌గా కనిపించనున్నారు. అయితే శుక్రవారం రామ్‌చరణ్‌ పుట్టినరోజును పురస్కరించుకుని ఉదయం 10 గంటలకు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి ఒక సర్‌ప్రైజ్‌ ఇస్తానని ఎన్టీఆర్‌ చెప్పారు. దీంతో అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్టీఆర్‌.. ‘సారీ బ్రదర్‌ రామ్‌చరణ్‌.. రాజమౌళి అభిప్రాయం తెలుసుకుందామని నీ గిఫ్ట్‌ను నేను గత రాత్రి ఆయనకి పంపించాను. రాజమౌళి దగ్గరికి వెళ్తే అది ఎంత ఆలస్యంగా వస్తుందో నీకు తెలుసు కదా.. చిన్న ఆలస్యం’ అని ట్వీట్‌ పెట్టారు. దీనిపై స్పందించిన రామ్‌చరణ్‌..‘ఏంటి ఆయనకి పంపించావా.. ఈరోజుకి వస్తుందా?’ అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ రిప్లై ఇచ్చారు.

మరోవైపు సర్‌ప్రైజ్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిరంజీవి ట్విటర్‌ వేదికగా రాజమౌళి, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ను ట్యాగ్‌ చేస్తూ.. ‘ఐ యామ్‌ వెయిటింగ్‌.. భీమ్‌ ఫర్‌ రామ్‌రాజు’ అని ట్వీట్‌ చేశారు. చిరు ట్వీట్‌పై స్పందించిన రాజమౌళి.. ‘సార్‌.. అంటే.. అది.. కొంచెం.. కొంచమే.. వాస్తవంగా.. ప్లీజ్‌.. సార్‌’ అని సరదాగా రిప్లై ఇచ్చారు. దీంతో ప్రస్తుతం భీమ్‌ ఫర్‌ రామరాజు అనే ట్యాగ్‌ సోషల్‌మీడియా ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది.

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కతోన్న ఈ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్న రామ్‌చరణ్‌కు జంటగా బాలీవుడ్‌ నటి ఆలియా భట్‌ నటించనుండగా... కొమరంభీమ్‌గా కనిపించనున్న ఎన్టీఆర్‌కు జంటగా హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరీస్‌ సందడి చేయనున్నారు. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌, హాలీవుడ్‌ నటీనటులు ఎలిసన్‌ డ్యూడీ, రేయ్‌ స్టీవ్‌సన్‌ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 8న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్రబృందం ప్రయత్నిస్తోంది.మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని