‘మోసగాళ్లు’ వచ్చేది అప్పుడే!
close
Updated : 05/04/2020 11:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘మోసగాళ్లు’ వచ్చేది అప్పుడే!

హైదరాబాద్‌: మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘మోసగాళ్లు’. కాజల్‌ కథానాయిక. సునీల్‌శెట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, ఆంగ్ల భాషల్లో ఏకకాలంలో రూపొందుతోంది. తెలుగు చిత్రాన్ని జూన్‌ 5న, ఆంగ్ల చిత్రాన్ని జులైలోనూ విడుదల చేయనున్నట్లు మంచు విష్ణు ప్రకటించారు. 

ప్రపంచంలోనే అతి పెద్ద ఐటీ కుంభకోణం నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. భారీ వ్యయంతో హైదరాబాద్‌లో ఓ ఐటీ ఆఫీస్‌ సెట్‌ని నిర్మించారు. అందులో చిత్రీకరణ జరుగుతుండగా, కరోనా ప్రభావంతో ఆపేశారు. దాదాపు చిత్రీకరణ పూర్తయిందని అందుకే విడుదల తేదీని ఖరారు చేశామని మంచు విష్ణు తెలిపారు. ఇందులో అర్జున్‌గా మంచు విష్ణు.. అను పాత్రలో కాజల్‌, ఏసీపీ కుమార్‌గా సునీల్‌శెట్టి నటిస్తున్నారు. ఈ పాత్రలకు సంబంధించి ఇటీవల విడుదల చసిన లుక్స్‌ ఆకట్టుకున్నాయి. ఇందులో నవదీప్‌ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు.మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని