కెరీర్‌ విషయంలో బాధపడ్డా : నితిన్‌
close
Published : 19/02/2020 19:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కెరీర్‌ విషయంలో బాధపడ్డా : నితిన్‌

పెళ్లంటే ఇంత ఉంటుందా అనిపించింది..!

హైదరాబాద్‌ : వరుసగా తాను నటించిన మూడు సినిమాలు ఫ్లాప్‌ కావడంతో కెరీర్‌ విషయంలో కొన్నిసార్లు బాధపడ్డానని అంటున్నారు యువ కథానాయకుడు నితిన్‌. ప్రస్తుతం  ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘భీష్మ’. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నితిన్‌కు జంటగా రష్మికగా నటించారు. ఫిబ్రవరి 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్‌లో విలేకర్లతో సరదాగా ముచ్చటించారు. ఆ విశేషాలివే.. 

నాలుగేళ్లు ఆలస్యం..

షాలిని నేను ఒక కామన్‌ ఫ్రెండ్‌ వల్ల 2012లో కలుసుకున్నాం. ఆ తర్వాత మేమిద్దరం మంచి స్నేహితులమయ్యాం. ఒకరోజు అనుకోకుండా తనకి నేనే మొదట ప్రపోజ్‌ చేశాను. తను కూడా వెంటనే ఓకే చెప్పేసింది. అలా కొన్ని సంవత్సరాల ప్రేమ తర్వాత గతేడాది మా ఇద్దరి ఇళ్లలో విషయం చెప్పాం. పెద్దవాళ్లు కూడా వెంటనే ఓకే అనేశారు. దాంతో ఏప్రిల్‌ 15న నిశ్చితార్థం, ఏప్రిల్‌ 16న వివాహం చేసుకోనున్నాం. ఇరు కుటుంబ పెద్దలు, సన్నిహితుల సమక్షంలో దుబాయ్‌లో వివాహం జరగనుంది. ఏప్రిల్‌ 21న హైదరాబాద్‌లో రిసెప్షన్‌ను ఏర్పాటు చేయనున్నాం. నిజం చెప్పాలంటే నాలుగేళ్లు ఆలస్యంగా నేను పెళ్లి చేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఒక పెద్ద అంశం. మానసికంగా సిద్ధం కావడానికి నాకు ఇంత టైం పట్టింది.

అప్పుడే చెప్పాడు

‘శ్రీనివాస కళ్యాణం’ షూటింగ్‌ సమయంలో వెంకీ కుడుముల నన్ను మొదటిసారి కలిశాడు. అప్పుడే నాకు ‘భీష్మ’ కథకు సంబంధించిన మెయిన్‌ లైన్‌ చెప్పాడు. ఆ లైన్‌ను డెవలప్‌ చేయడానికి చాలా టైం పట్టింది. అలా ఈ ఏడాది ఆరంభంలో ‘భీష్మ’ విడుదల అవుతుంది. ‘అంధాధున్‌’ రీమేక్‌, ‘రంగ్‌దే’తోపాటు మరో సినిమా కూడా ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. ఈ ఏడాది నాకు చాలా ప్రత్యేకమనే చెప్పాలి.

లవ్‌స్టోరీ వద్దనుకున్నా..

లవ్‌స్టోరీలను వరుసగా చేయడం వల్ల బోర్‌ కొట్టలేదు. ఎందుకంటే దేనికదే విభిన్నమైన కథలు. కాకపోతే లవ్‌స్టోరీలు చేయకూడదని మాత్రం అనుకున్నాను. అందుకే ఈసారి కొంచెం విభిన్నమైన కథల్లో నటించాలనుకుంటున్నాను. అలా ‘అంధాధున్‌’ రీమేక్‌లో నటించనున్నాను. లవ్‌స్టోరీ వద్దనుకుంటూనే ‘రంగ్‌దే’ కథ విన్నాను. కథ నాకు బాగా నచ్చింది. లైఫ్‌లో తప్పకుండా అలాంటి పాత్ర చేయాలనుకున్నాను అందుకే ఆ సినిమాకు ఓకే చెప్పేశాను. 

కెరీర్‌ విషయంలో కొంచెం బాధపడ్డా

నా కెరీర్‌ను చూసుకున్నప్పుడు కొన్ని విషయాల్లో బాధపడ్డాను. నా లాస్ట్‌ మూడు సినిమాలు పరాజయం అయ్యాయి. అందుకే కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. అందుకే గతేడాది విరామం తీసుకున్నాను. ఇక నుంచి సినిమాల విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలనుకుంటున్నాను.

‘లై’ ఆడుతుందనుకున్నా..

నేను చివరిగా నటించిన మూడు సినిమాలు ఫ్లాప్‌ అయ్యాయి. అయితే ‘లై’ సినిమా మాత్రం విజయం సాధిస్తుందని నమ్మాను. కాకపోతే అది పరాజయమైంది. ‘ఛల్‌ మోహన్‌రంగా’ సినిమాపై నాకు అంత నమ్మకం లేదు. ‘శ్రీనివాస కల్యాణం’ కథ నాకు బాగా నచ్చింది. కాకపోతే అలాంటి కాన్సెప్ట్‌ను ప్రేక్షకులు ఓకే చేస్తారా అని డౌట్‌ ఉండేది.

అదొక ఛాలెంజ్‌..

‘అంధాధున్‌’ రీమేక్‌ జూన్‌ నుంచి షూటింగ్‌ ప్రారంభం కానుంది. మేర్లపాక గాంధీ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ‘అంధాధూన్‌’ ఒక క్లాసిక్‌ మూవీ. అలాంటి సినిమాను రీమేక్‌ చేయడాన్ని ఒక ఛాలెంజ్‌గా తీసుకున్నాను.

మంచి కథ వస్తే చేస్తా..

బాలీవుడ్‌లో చాలా మంది నటీనటులు వెబ్‌ సిరీస్‌లు చేస్తున్నారు. నాకు కూడా వెబ్‌ సిరీస్‌లలో నటించాలని ఇష్టం ఉంది. ఒక మంచి కథ వస్తే తప్పకుండా నటిస్తాను.

‘అతడు’ సినిమా..

ఈ సినిమాలోని ఒక ఫైట్‌ సీక్వెన్స్‌ త్రివిక్రమ్‌కు బాగా నచ్చిందని చెప్పారు. ‘అతడు’ ఫైట్‌లా ఉందని తెలిపారు. నిజం చెప్పాలంటే మేము ‘అతడు’ సినిమాలోని ఫైట్‌నే స్ఫూర్తిగా తీసుకుని ఆ ఫైట్‌ను తెరకెక్కించాం.

శ్రీనివాస కల్యాణంతో..
శ్రీనివాస కల్యాణం షూటింగ్‌ సమయంలోనే నాకు పెళ్లంటే ఎంటో తెలిసింది. ఆ సినిమా షూటింగ్‌ అప్పుడు పెళ్లంటే ఇంత ఉంటుందా అనిపించింది. మొన్న మా ఇంట్లో పెళ్లి పనులు ప్రారంభించినప్పుడే నాకు అర్థమైంది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని