2020 బెస్ట్‌ పిక్‌ ఇదే..!
close
Updated : 03/01/2020 12:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

2020 బెస్ట్‌ పిక్‌ ఇదే..!

చిరు-మోహన్‌బాబు ఆలింగనంపై విష్ణు, మనోజ్‌ కామెంట్‌

హైదరాబాద్‌: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) డైరీ విడుదల కార్యక్రమం రసాభాసగా సాగిన విషయం తెలిసిందే. ఈ డైరీ విడుదల కార్యక్రమానికి హాజరైన చిరంజీవి, మోహన్‌బాబు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం మోహన్‌బాబు ముద్దు పెట్టమని కోరగా.. చిరంజీవి ఆయన్ని ప్రేమగా ముద్దుపెట్టుకున్నారు. అంతేకాకుండా చిరంజీవికి తనకి మధ్య ఏలాంటి విభేదాలు లేవని, కళామతల్లి ముద్దు బిడ్డలమని మోహన్‌బాబు తెలిపారు. దీంతో చిరు-మోహన్‌బాబు ఆలింగనం చేసుకున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇదిలా ఉండగా మంచు విష్ణు, మంచు మనోజ్‌ ట్విటర్‌ వేదికగా ఈ ఫొటోలను షేర్‌ చేశారు. వీరిద్దరి మధ్య ఉన్న స్నేహ్నాన్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని మంచు విష్ణు తెలిపారు. ‘ఈ ఇద్దరు లెజెండ్స్‌ ఎంత ప్రశాంతంగా ఉన్నారో.. మా తరం అందరిలోనూ స్ఫూర్తి నింపారు. అలాగే భవిష్యత్తు తరాల వారిలోనూ స్ఫూర్తిని నింపుతున్నారు. నిజమైన గ్యాంగ్‌స్టార్స్‌. వీరి మధ్య ఉన్న స్నేహం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. టాలీవుడ్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ రాక్స్‌..!’ అని మంచు విష్ణు పేర్కొన్నారు. మరోవైపు మంచు మనోజ్‌ సైతం ఈ ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘బెస్ట్‌ పిక్‌తో 2020 ప్రారంభమైంది.’ అని అన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని