పండగ వేళ... మెగా కుటుంబాన్ని చూశారా
close
Published : 15/01/2020 12:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పండగ వేళ... మెగా కుటుంబాన్ని చూశారా

హైదరాబాద్‌: మెగా కుటుంబ సభ్యులు సంక్రాంతి పండగను అత్యంత వేడుకగా జరుపుకొంటున్నారు. బుధవారం రామ్‌ చరణ్‌ మెగా ఫ్యామిలీ హీరోలంతా కలిసి ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో చిరంజీవి, చెర్రీ, అల్లు అర్జున్‌, అల్లు శిరీష్‌, సాయిధరమ్‌ తేజ్‌, వరుణ్‌తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌, కల్యాణ్‌ దేవ్‌, అకీరా కనిపించారు. ఈ చక్కటి ఫొటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే భోగి పండగకు సంబంధించిన ఫొటోలను చెర్రీ, సాయిధరమ్‌ తేజ్‌, వరుణ్‌తేజ్‌, సుస్మిత పంచుకున్న సంగతి తెలిసిందే.

అదేవిధంగా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కుమార్తె సౌందర్య రజనీకాంత్‌ చెన్నైలోని తన నివాసంలో పొంగళ్లు పెట్టిన ఫొటోను షేర్‌  చేశారు. అందరికీ పొంగల్‌ శుభాకాంక్షలు చెప్పారు. ‘నా చక్కటి భర్త, అద్భుతమైన అత్తామామలతో పొంగల్‌ సంబరాలు. తలైవా ఫొటోను త్వరలోనే షేర్‌ చేస్తాను’ అని ఆమె పోస్ట్‌ చేశారు. అదేవిధంగా నటి స్నేహ ఇంట కూడా సంక్రాంతిని వేడుకగా జరుపుకొన్నారు. ఆమె కూడా ఫ్యామిలీ ఫొటోను షేర్‌ చేశారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని