రష్మిక నివాసంలో ఐటీ సోదాలు
close
Updated : 16/01/2020 11:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రష్మిక నివాసంలో ఐటీ సోదాలు

బెంగళూరు: కథానాయిక రష్మిక నివాసంలో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. కొడుగు జిల్లా విరాజ్‌పేటలోని ఆమె నివాసంలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ ఉదయం 7.30 గంటల ప్రాంతంలో సోదాలు ప్రారంభమయ్యాయి. రష్మిక ఆదాయ లెక్కలను పరిశీలిస్తున్నారు. దీనిపై రష్మిక మేనేజర్‌ స్పందిస్తూ.. ఇలాంటి ఐటీ దాడులు సహజమే అన్నారు.

రష్మిక నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలై, హిట్ అందుకుంది. మహేశ్‌బాబు కథానాయకుడిగా నటించిన ఈ సినిమాకు అనిల్‌రావిపూడి దర్శకత్వం వహించారు. మరోపక్క రష్మిక, నితిన్‌ జంటగా నటించిన ‘భీష్మ’ ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  మరోపక్క అల్లు అర్జున్‌-సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాలో నటించబోతున్నారు. కార్తితో కలిసి ఓ తమిళ సినిమాలోనూ రష్మిక నటిస్తున్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని