‘సైనికులను కలిసిన మహేశ్‌ బాబు’
close
Updated : 26/01/2020 12:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘సైనికులను కలిసిన మహేశ్‌ బాబు’

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన తారలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశవ్యాప్తంగా 71వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పలువురు టాలీవుడ్‌, బాలీవుడ్‌ ప్రముఖులు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. టాలీవుడ్‌ అగ్రకథానాయకుడు మహేశ్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రబృందంతో కలిసి సీఐఎస్‌ఎఫ్‌ అకాడమీలోని జవాన్లను కలిశారు. అనంతరం జవాన్లతో ముచ్చటించారు. 

‘ఎంతో ధైర్యసాహసాలు ప్రదర్శించే మన సైనికులను కలవడం నాకెంతో సంతోషంగా ఉంది. ఇది నా జీవితంతో ఎప్పటికీ గుర్తుండే ఒక రోజు. మనల్ని ప్రతిరోజూ కాపాడుతున్న జాతీయ హీరోలకు సెల్యూట్‌’ - మహేశ్‌ బాబు

‘పోరాటం లేకుండా ఒక మంచి పని జరగదు. ఓ అందమైన రోజును మనకందించిన పోరాటాన్ని గుర్తు చేసుకుందాం.’ - షారుఖ్‌ ఖాన్‌

‘ప్రతి ఒక్కరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజును గుర్తుచేసుకుని, సెలబ్రేట్‌ చేసుకుందాం. స్వాతంత్ర్య పోరాట యోధులకు నివాళులర్పిందాం’ - మంచు మనోజ్

‘ఫస్ట్‌లీ అండ్‌ లాస్ట్‌లీ.. వి ఆర్‌ ఇండియన్స్’ - ప్రియదర్శి

‘ఎంతో గొప్ప చరిత్ర ఉన్న ఈ దేశంలో మనం నివసిస్తున్నందుకు గర్వపడదాం. మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు’ - సునీల్‌

వీరితోపాటు కాజల్‌ అగర్వాల్‌, మెహరీన్‌, రాశీఖన్నా, నాగార్జున, అంజలి, వరుణ్‌ధావన్, రంగోలీ తదితరులు దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు మహేశ్‌ కథానాయకుడిగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రబృందం రిపబ్లిక్‌ డేను పురస్కరించుకుని కొత్త వీడియోను విడుదల చేసింది.

 

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని