మరోసారి ఏడ్చేసిన హీరో సూర్య
close
Updated : 28/01/2020 09:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మరోసారి ఏడ్చేసిన హీరో సూర్య

చెన్నై: తమిళ కథానాయకుడు సూర్య మరోసారి వేదికపై కన్నీటి పర్యంతమయ్యారు. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న చిన్నారులను చదివించేందుకు ఆయన ‘అగరం’ ఫౌండేషన్‌ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆ సంస్థ పదో వార్షికోత్సవం తాజాగా చెన్నైలో వేడుకగా జరిగింది. దీనికి సూర్య, ఆయన తండ్రి శివకుమార్‌తోపాటు సోదరుడు కార్తి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా భాగంగా సూర్య.. ఫౌండేషన్‌ కోసం శ్రమిస్తున్న జయశ్రీ, ఆమె కుటుంబం గురించి మాట్లాడారు. ఈ క్రమంలో సూర్య ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. ఉద్వేగం తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నారు.

సూర్య మాట్లాడుతూ.. తాను భవిష్యత్తులో మరిన్ని ఎక్కువ చిత్రాల్లో నటిస్తానని అలా వచ్చిన డబ్బుతో చిన్నారులకు మంచి చదువును అందించడానికి సాయం చేస్తానని తెలిపారు. ఇదిలా ఉండగా ఇటీవల ఫౌండేషన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఓ పేద విద్యార్థిని తాను ఎదుర్కొన్న కష్టాలను వివరిస్తుండగా.. సూర్య కన్నీటి పర్యంతమైన విషయం తెలిసిందే.

 

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని