close
Published : 04/02/2020 09:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘బాహుబలి’ VS ‘ఆర్‌ఆర్‌ఆర్‌’: మాటల యుద్ధం

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఫస్ట్‌లుక్‌: మాహిష్మతి వెయిటింగ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకూ ఒక్క ఫొటోను కూడా చిత్ర బృందం విడుదల చేయలేదు. కొత్త సంవత్సరం, సంక్రాంతి అన్నీ వెళ్లిపోయాయి. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు ఆసక్తికర ప్రశ్న సంధించాడు.  తాను మాహిష్మతి సామ్రాజ్యానికి చెందిన వ్యక్తినని తాను ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఫస్ట్‌లుక్‌ కోసం వేచి చూస్తున్నానని అన్నాడు. దీనిపై ‘బాహుబలి’ టీమ్‌ స్పందించింది.

‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ మా మాహిష్మతి ప్రజలు ఫస్ట్‌లుక్‌ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇలా అంటున్నందుకు క్షమించాలి. ప్రతి పండగకు శుభకాంక్షలు, ధన్యవాదాల సందేశాలతో సరిపెడుతున్నారు. మీరు పంచుకుంటున్న సందేశాలతో మా ప్రజలకు బాగా కాలక్షేపం అవుతోంది. డియర్‌ కెప్టెన్‌ రాజమౌళి దయచేసి అప్‌డేట్‌ ఇవ్వండి.. ప్లీజ్‌..’’ అని బాహుబలి ట్వీట్‌ చేసింది. దీనికి స్పందించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ కూడా ‘బాహుబలి’ టీమ్‌కు అదిరిపోయే పంచ్‌ ఇచ్చింది. 

దీనికి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ బదులిస్తూ.. ‘‘మీ మాటలు చూస్తే కింద పడి దొర్లి మరీ నవ్వాలనిపిస్తోంది. ఎవరు దేని గురించి మాట్లాడుతున్నారు? మీ అడుగు జాడల్లోనే మేము నడుస్తున్నాం. ‘బాహుబలి’ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు, ట్రైలర్‌ కోసం అభిమానులు ఎంతగా వేచి చూశారో మేం మర్చిపోలేదు. మేము మా అభిమానులను ఎంతో ప్రేమిస్తాం. వాళ్లూ మమ్మల్ని అంతేలా ప్రేమిస్తారు. వాళ్లు పెట్టుకున్న ఆశలను మేము నెరవేరుస్తామని వాళ్లకు తెలుసు. కాబట్టి దయ చేసి ‘ఆర్ఆర్ఆర్‌’ ఫస్ట్‌లుక్‌ కోసం వేచి చూడండి. త్వరలోనే వస్తుంది’’ అని ట్రిపుల్‌ పంచ్‌ ఇచ్చింది.
శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ‘ఆర్ఆర్‌ఆర్‌’లో రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా కనిపించనుండగా, ఎన్టీఆర్‌ కొమరం భీంగా నటిస్తున్నారు. చెర్రీకి జోడీగా అలియా భట్‌, తారక్‌ సరసన ఓలివియా మోరిస్‌లు సందడి చేయనున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని జులై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల అజయ్‌దేవగణ్‌తో కలిసి తారక్‌, చరణ్‌ దిగిన ఫొటోలను చిత్ర బృందం అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే.

Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని