మాస్క్‌లు ఇలా కూడా చేసుకోవచ్చు: ఉపాసన
close
Published : 06/03/2020 14:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మాస్క్‌లు ఇలా కూడా చేసుకోవచ్చు: ఉపాసన

లక్షణాలున్నప్పుడే మాస్క్‌లు వాడండి

హైదరాబాద్‌: ప్రపంచం మొత్తాన్ని కరోనా వైరస్‌(కొవిడ్‌-19) కలవరపెడుతున్న తరుణంలో దాని బారిన పడకుండా ఉండేందుకు చాలామంది సాధారణ మాస్క్‌లతోపాటు ఎన్‌-95 మాస్క్‌లను వాడుతున్నారు. దీంతో ప్రస్తుతం దేశంలో చాలాచోట్ల మాస్క్‌ల కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. మాస్క్‌ల కొరతను దృష్టిలో ఉంచుకుని ఉపాసన కొణిదెల సోషల్‌మీడియా వేదికగా ఇన్‌స్టెంట్‌ మాస్క్‌ల గురించి ఓ వీడియో పోస్టు చేశారు. అంతేకాకుండా మనకి కానీ మన చుట్టూ ఉన్నవారికి కానీ కరోనా లక్షణాలున్నప్పుడు మాత్రమే మాస్క్‌లను ధరించాలని ఆమె సూచించారు.

‘హాయ్‌ ఆల్‌.. కరోనా గురించి భయం వీడండి. బాధ్యత కలిగిన పౌరుడిగా వ్యవహరించండి. మందుల దుకాణాల్లో మాస్క్‌లు, శానిటైజర్స్‌ సరిగ్గా దొరకడం లేదని చాలా మంది అంటున్నారు. దేశంలో ఎన్‌-95 మాస్క్‌ల కొరత ఉంది. అందరికీ సప్లై చేసేందుకు ఆయా ఫ్యాక్టరీలు ఎంతో వర్క్‌ చేస్తున్నాయి. టిష్యూతో మాస్క్‌లు చేసుకోవడం గురించి ఇటీవల నేను ఆన్‌లైన్‌లో చూశాను. కాబట్టి మాస్క్‌లు ధరించాలని భావించేవారు ఇలా కూడా చేసుకోవచ్చు. మాస్క్‌ను తీసిన వెంటనే బయటపడేయకుండా.. చెత్తబుట్టలో వేయండి. మీకు కానీ, మీ చుట్టూ ఉన్నవారికి కానీ కరోనా లక్షణాలు ఉన్నప్పుడు మాత్రమే మాస్క్‌ను ధరించండి’ అని ఉపాసన తెలిపారు. మాస్క్‌లు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి..
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని