మహేశ్‌ను అడగ్గానే వెంటనే సాయం చేశారు!
close
Published : 23/04/2020 22:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహేశ్‌ను అడగ్గానే వెంటనే సాయం చేశారు!

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ కారణంగా పేద, మధ్య తరగతి వారు ఎన్నోఇబ్బందులు పడుతున్నారు. పనికెళితేగానీ పూటగడవని ఎంతో మంది నానా అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో తన చుట్టూ ఉన్న వారిని ఆదుకోవడానికి సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ నడుం బిగించిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ కారణంగా ఫాం హౌస్‌లో ఉండిపోయిన ఆయన ఉపాధిలేక బాధపడుతున్న వారికి సాయం చేస్తున్నారు. తాజాగా తన ఆర్థిక వనరులు క్షీణిస్తున్నాయని, అవసరమైతే అప్పు తీసుకుని సాయంచేస్తానని ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ.. అడిగితే తనకు డబ్బులు ఇచ్చేవాళ్లు చాలామంది ఉన్నారని, ఒకసారి అడగ్గానే అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు తన ఫౌండేషన్‌కు సాయం చేశారని తెలిపారు. 

‘‘మనసుంటే మార్గం ఉంటుంది. కరోనా వైరస్‌ వల్ల నా ఫాం హౌస్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది. మూడు గ్రామాలను దత్తత తీసుకున్నా. ఆరు ప్రభుత్వ పాఠశాలలను నడుపుతున్నా. ఇప్పటికీ 1000మందికి అన్నం పెట్టగలిగే శక్తి నాకుంది. చెన్నైలో మత్స్యకారుల కాలనీకి అవసరమైన వాటిని మా వాళ్ల ద్వారా పంపిస్తున్నాను. బెంగళూరు హసిరుదళ అనే ఒక గ్రూప్‌ ద్వారా రోజు కూలీలకు సాయం చేస్తున్నా. ఇక్కడ, షాద్‌నగర్‌లో నా ఫౌండేషన్‌ పనిచేస్తోంది. ఇన్నేళ్లు సినిమా ఇండస్ట్రీలో ఉండి చాలా సంపాదించాను.  రిజర్వ్‌ ఫండ్‌ అనేది ఎప్పుడూ ఉంటుంది. అది ఖర్చయిపోతోంది. పైగా సంపాదన లేదు. నేను అప్పు అడిగితే ఇస్తారు. పది మందికి సాయం చేయాలని ఉన్నప్పుడు అప్పు తీసుకుని మరీ సాయం చేస్తాను. షూటింగ్‌లు ప్రారంభమైతే ఆ మొత్తాన్ని సంపాదించడానికి ఎక్కువ రోజులు పట్టదు’’

‘‘నా తల్లి అనాథాశ్రమం నుంచి వచ్చింది. ఆమెను ఎవరో పెంచి పెద్ద చేశారు. ఆ తర్వాత ఆమె నర్సుగా పనిచేశారు. నెలకు 2వేలు జీతం. ఎవరైనా రూ.500 అడగటానికి వస్తే, తన చెవి రింగులు తాకట్టు పెట్టుకుని తీసుకోమని చెప్పేది. ‘ఎందకమ్మా.. మనకు లేదు కదా’ అని అడిగితే, ‘మనకు ఎవరైనా అప్పు ఇస్తారు కదా. ఆ మాత్రం శక్తి ఉంది కదా’ అని చెప్పేది. ‘నువ్వు ఇస్తూనే ఉండు, నీకు వస్తూనే ఉంటాయి’ అని అమ్మ ఎప్పుడో నేర్పింది. నేను ఇస్తూనే ఉన్నాను. నాకు వస్తూనే ఉంది. నేను చేసే పోస్టుల వల్ల ఎవరో ఒకరు ఇన్‌స్పైర్‌ అవుతారని నా ఉద్దేశం. వాళ్లు నాకు ఫోన్‌ చేసి ‘సర్‌ మేము మీకు డబ్బులు ఇస్తాం’ అంటారు. ‘నాకు వద్దు. మీ పక్కన ఉన్న వాళ్లకు సాయం చేయండి’ అని చెబుతాను. నేను అడిగితే ఇస్తారు. ఒకసారి మహేశ్‌బాబును అడిగితే వెంటనే నా ఫౌండేషన్‌కు డబ్బు పంపారు. అలాగే నిర్మాత అనిల్‌ సుంకరగారు కూడా. నా దగ్గర లేకపోయినా, నాకు ఇచ్చే వాళ్లు ఉన్నారు. ఇటీవల జీకే రెడ్డిని కలిసినప్పుడు డబ్బులు ఇచ్చారు. నేను సర్దుబాటు చేసుకోగలను. కానీ, అందరికీ సాయం చేసే సంస్థలకు డబ్బులు కావాలి. మీరు కూడా ప్రయత్నించాలి’’ అని ప్రకాశ్‌ రాజ్‌ చెప్పుకొచ్చారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని