శ్రుతిహాసన్‌ టిక్‌టాక్‌..త్రిష వీడియో కాల్‌
close
Published : 02/05/2020 19:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శ్రుతిహాసన్‌ టిక్‌టాక్‌..త్రిష వీడియో కాల్‌

సోషల్‌మీడియాలో ముద్దుగుమ్మల సందడి

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ సమయంలో ఇంటికే పరిమితమైన సెలబ్రిటీలు సోషల్‌మీడియాలో చాలా హుషారుగా ఉంటున్నారు. ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టా.. ఇలా పలు సామాజిక మాధ్యమాల వేదికగా కొందరు సెలబ్రిటీలు అభిమానులతో ముచ్చటిస్తుంటే.. మరికొందరు తమ పాత జ్ఞాపకాలను పోస్ట్‌ చేస్తూ అభిమానుల హృదయాలను హత్తుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇన్‌స్టా వేదికగా పలువురు ముద్దుగుమ్మలు ఆసక్తికర వీడియో, ఫొటోలతో సందడి చేశారు. శ్రుతిహాసన్‌, తన సోదరి అక్షర హాసన్‌తో కలిసి టిక్‌టాక్‌ ఛాలెంజ్‌ కోసం ఓ వీడియోను చేయగా.. త్రిష, దర్శకుడు గౌతమ్‌ మేనన్‌తో వీడియోకాల్‌లో ముచ్చటించారు. మరోవైపు సమీరారెడ్డి.. లాక్‌డౌన్‌కు ముందు, లాక్‌డౌన్‌లో అని పేర్కొంటూ ఓ ప్రత్యేక వీడియోను రూపొందించి నెటిజన్లను ఆకట్టుకున్నారు. రోజూ ఓ మధురమైన జ్ఞాపకాన్ని పోస్ట్‌ చేస్తున్న నమ్రత తాజాగా తన కుమార్తె సితారకు సంబంధించిన ఓ డ్యాన్స్‌ వీడియోను అభిమానులతో పంచుకుంది.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని