విజయ్‌ దేవరకొండ నా క్రష్‌: అమైరా
close
Published : 15/05/2020 16:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విజయ్‌ దేవరకొండ నా క్రష్‌: అమైరా

టాలీవుడ్‌ రౌడీపై మనసు పారేసుకున్న మరో హీరోయిన్‌

హైదరాబాద్‌: నటుడిగా వెండితెరపైకి అడుగుపెట్టి.. ‘అర్జున్‌రెడ్డి’ లాంటి బోల్డ్‌ కథాచిత్రంతో ఒక్కసారిగా సెన్సేషనల్‌ హీరోగా పేరు తెచ్చుకున్నారు విజయ్‌ దేవరకొండ. తన స్టైల్‌, లుక్స్‌తో ఇటు సినీ ప్రియులతోపాటు అటు సినీ ఇండస్ట్రీలో ఉన్న ఎందరో అమ్మాయిల హృదయాలను కొల్లగొట్టారు. ఇప్పటికే బాలీవుడ్‌ ముద్దుగుమ్మలు జాన్వీకపూర్‌, ఆలియాభట్‌, అనన్యపాండే.. విజయ్‌ దేవరకొండ అంటే ఇష్టమని పలు సందర్భాల్లో తెలియజేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో బాలీవుడ్‌ భామ సైతం ఆయనపై మనసు పారేసుకున్నారు. టాలీవుడ్‌ హీరోల్లో విజయ్‌ అంటే తనకి ఎంతో ఇష్టమని చెప్పారు.

బాలీవుడ్‌లో తెరకెక్కిన ‘రాజ్మా చావ్లా’, ‘ప్రస్థానం’ చిత్రాల్లో నటించి.. అటు హిందీతోపాటు ఇటు తమిళ, తెలుగు చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న నటి అమైరా దస్తూర్‌‌. ప్రస్తుతం హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్న ఆమెను ఓ ఛానెల్‌ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా ‘విజయ్‌ దేవరకొండ గురించి మిమ్మల్ని అడగొచ్చా? మీకు ఆయనంటే ఇష్టమేనా?’ అంటూ సదరు విలేకరి ప్రశ్నకు ఆమె.. ‘నాకు విజయ్‌ అంటే ఇష్టం. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన హీరోలందరిలో విజయ్‌పై నాకు క్రష్‌ ఉంది. ‘అర్జున్‌రెడ్డి’ చిత్రంలో ఆయన నటన చూసి మైమరచిపోయాను. ఆయనతో కలిసి ఓ సినిమాలో నటించాలనుంది. కాకపోతే అది హిందీ సినిమా అయితే బాగుంటుందని ఆశిస్తున్నాను’ అని తెలిపారు. 2018లో విడుదలైన ‘మనసుకు నచ్చింది’, ‘రాజుగాడు’ చిత్రాల్లో అమైరా సందడి చేశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని