రజనీ మనసులో ఏముందో తెలియదు:ఖుష్బూ
close
Published : 07/06/2020 07:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రజనీ మనసులో ఏముందో తెలియదు:ఖుష్బూ

చెన్నై: చిత్ర పరిశ్రమకు చెందిన వారు రాజకీయాల్లోకి రావాలని నటి ఖుష్బూ అన్నారు. కొన్నేళ్ల క్రితమే ఆమె కాంగ్రెస్‌ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా తన సహ నటులు రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ రాజకీయ ప్రవేశం గురించి మీడియాతో ముచ్చటించారు. రజనీకాంత్‌ ‘కింగ్‌’లా ఉండాలని.. ‘కింగ్‌ మేకర్‌’ కాకూడదని (తమ పార్టీకి ఓట్లు వేయమని ప్రజల్ని ఆకర్షించే వ్యక్తి) చెప్పారు. మాజీ ముఖ్యమంత్రులు జయలలిత, ఎమ్‌. కరుణానిధి మరణంతో తమిళనాడు రాజకీయాల్లో లోటు ఏర్పడిందని అన్నారు.

‘ప్రజలు, రాష్ట్ర అభివృద్ధి కోసం రజనీకాంత్‌ మనసులో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో మాకు ఇప్పటికీ తెలియదు. గత లోక్‌సభ ఎన్నికల్లో కమల్‌ బాగా రాణించారు. ఏదేమైనప్పటికీ భవిష్యత్తు తెలియాలంటే ఎదురుచూడాల్సిందే. ఎన్నికలు ఎప్పుడూ విభిన్నంగానే ఉంటాయి. రజనీ త్వరలోనే తన పార్టీని ప్రారంభిస్తారని ఆశిస్తున్నా. చిత్ర పరిశ్రమకు చెందిన వారు రాజకీయాల్లోకి రావాలనేది నా ఆశ. రజనీ, కమల్‌తో అది ముగిసిపోకూడదు. యువ నటీనటులు వస్తే.. మార్పు మరోలా ఉంటుంది. రాజకీయాల్లో ఆసక్తి ఉన్న వారిని ప్రోత్సహిస్తే.. ధైర్యంగా ముందుకు వస్తారు. రజనీ కింగ్‌మేకర్‌లా ఉండకూడదు. కింగ్‌లా ఉండాలి. అప్పుడే ప్రజలు ఆయనకు ఓట్లు వేస్తారు’ అని ఆమె చెప్పారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని