చిన్నారి ఒళ్లో హాయిగా.. 
close
Updated : 01/05/2021 10:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిన్నారి ఒళ్లో హాయిగా.. 

ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు తన తనయ సమైరా అంటే ఎంతో ప్రేమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడా తండ్రి, కుమార్తె ఇలా కనిపించేసరికి ఎంతో ముచ్చటేస్తోంది. శుక్రవారం రోహిత్‌ 34వ జన్మదినం సందర్భంగా.. తన ఒళ్లో సేదతీరుతున్న తండ్రిపై ఆప్యాయంగా తల వాల్చి ఉన్న సమైరా ఫోటోను పోస్టు చేసిన రితికా తన భర్తకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.

ఓటమి బాధ

‘‘ఓటమి బాధిస్తోంది. పరిస్థితులు మాకు అనుకూలంగా లేవు. కానీ మేం యోధులమని నాకు తెలుసు. మేమెప్పటికీ తలొగ్గం’’ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆరు మ్యాచ్‌ల్లో ఒక్క విజయమే సాధించిన నేపథ్యంలో ట్విట్టర్‌లో ఆ జట్టు కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ ఇలా స్పందించాడు.

ఇప్పుడిదే ‘ముద్దు’

ప్రస్తుత కరోనా కాలంలో భౌతిక దూరం పాటించడం అత్యవసరం. ఇక్కడ ముంబయి ఇండియన్స్‌ బ్యాట్స్‌మన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ కూడా అదే చేస్తున్నాడు. భౌతిక దూరం పాటిస్తూనే తన భార్యను ముద్దు పెట్టుకున్నాడు. గురువారం  రాజస్థాన్‌ రాయల్స్‌పై విజయం తర్వాత.. మైదానంలో ఉన్న అతను స్టాండ్స్‌లో ఉన్న తన భార్య దేవిశను కలిసేందుకు వచ్చాడు. వాళ్లిద్దరి మధ్యలో గాజు తెర ఉన్నప్పటికీ దానిపై నుంచే ఆమెకు ముద్దిచ్చాడు.  మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని