ఎమ్మెల్సీ స్థానానికి కల్వకుంట్ల కవిత నామినేషన్‌
close
Updated : 18/03/2020 16:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎమ్మెల్సీ స్థానానికి కల్వకుంట్ల కవిత నామినేషన్‌

నిజామాబాద్‌(కలెక్టరేట్‌): నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు. హైదరాబాద్‌ నుంచి ఆమె నేరుగా నిజామాబాద్‌ చేరుకుని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌తో పాటు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలను జిల్లా కలెక్టర్‌, ఎన్నికల అధికారి నారాయణరెడ్డికి సమర్పించారు. ఆమెతో పాటు ఎమ్మెల్యేలు గణేశ్‌గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్‌‌, హన్మంత్‌ షిండే, జీవన్‌ రెడ్డి, షకీల్‌, సురేందర్‌, ఎమ్మెల్సీలు వి.జి.గౌడ్‌, లలిత, నిజామాబాద్‌ జడ్పీ ఛైర్మన్‌ విఠల్‌రావు, నగర మేయర్‌ నీతూ కిరణ్‌తో పాటు కార్పొరేటర్లు, జడ్పీటీసీ సభ్యులు తరలివచ్చారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని