ట్యాక్సీ యజమానులను ఆదుకోవాలి: పవన్‌
close
Published : 19/06/2020 20:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ట్యాక్సీ యజమానులను ఆదుకోవాలి: పవన్‌

అమరావతి: పర్మిట్‌ ఫీజులు, రోడ్డు ట్యాక్సులు రద్దు చేసి ట్యాక్సీ యజమానులను ఆదుకోవాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. లాక్‌డౌన్‌ మూలంగా అన్ని రంగాల మాదిరిగానే ట్యాక్సీలు నడుపుకొంటూ జీవించేవారు కూడా కష్టాల్లో పడ్డారని పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ ఉన్నంత కాలం వాహనాలు తిప్పే పరిస్థితి లేకపోయిందని, సడలింపులు ఇచ్చినా ఉపాధి అవకాశాలు నామమాత్రంగానే ఉన్నాయని ఆయన అన్నారు. ఇలాంటి ఇబ్బందుల్లో రోడ్ ట్యాక్స్, పర్మిట్ ఫీజులు చెల్లించాలని ట్యాక్సీ యజమానులపై రవాణా శాఖ ఒత్తిడి చేయడం భావ్యం కాదని పవన్‌ అభిప్రాయపడ్డారు. వీరి బాధలను సానుభూతితో రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని, రోడ్లపై తిరగని వాహనాలకు లాక్‌డౌన్‌ సమయంలో పర్మిట్ ఫీజు, రోడ్ ట్యాక్స్‌ రద్దు చేయాలని కోరారు. అలాగే సీట్ల కుదింపు ఉన్నంత వరకూ పన్నుల్లో 50 శాతం రాయితీ ఇవ్వాలన్నారు. ప్రజా రవాణా రంగంలో భాగమైన మాక్సీ టాక్సీ క్యాబ్స్ యజమానులు, వాటిపై ఆధారపడ్డ డ్రైవర్ల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని