18న కాంగ్రెస్‌ ‘స్పీకప్‌ తెలంగాణ’
close
Published : 13/07/2020 00:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

18న కాంగ్రెస్‌ ‘స్పీకప్‌ తెలంగాణ’

హైదరాబాద్‌: కొవిడ్‌ గురించి రాష్ట్ర ప్రజల ఆందోళలను వినిపించడానికి కాంగ్రెస్‌ పార్టీ వేదికను ఏర్పాటు చేస్తోంది. ‘స్పీకప్‌ తెలంగాణ’ పేరుతో సోషల్‌ మీడియాలో ఆన్‌లైన్‌ వేదికను ఏర్పాటు చేస్తోంది. ఈ నెల 18న ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ ద్వారా ప్రజలు తమ ఆందోళనను వినిపించొచ్చని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటన విడుదల చేసింది. 

కొవిడ్ మహమ్మారి, ఆరోగ్యం, విద్య సమస్యలపై చర్చించేందుకు ఆన్‌లైన్‌ ద్వారా పీసీసీ కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశమైంది. వీడియో కాన్ఫరెన్స్‌లో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ మర్రి శశిధర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కొవిడ్‌ను నిలువరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఉత్తమ్‌  ఆందోళన వ్యక్తం చేశారు. 13 రోజులుగా  కేసిఆర్ అదృశ్యమవడం దురదృష్టకరమని ఉత్తమ్‌ వ్యాఖ్యానించారు. 

శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ద్వారా స్పీకప్‌ తెలంగాణలో ప్రజల అభిప్రాయాలు వెల్లడించొచ్చు. మరోవైపు మహమ్మారిని ఎదుర్కోవడానికి పరిశీలనలు, సూచనలను, సలహాలతో సీఎంకు బహిరంగ లేఖ రాయాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని