‘దిశ’ చట్టం చరిత్రలో నిలిచిపోతుంది: జగన్‌
close
Updated : 08/02/2020 18:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘దిశ’ చట్టం చరిత్రలో నిలిచిపోతుంది: జగన్‌

రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘దిశ’ పోలీస్‌స్టేషన్‌ను ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు సుచరిత, మోపిదేవి వెంకటరమణ, ఏపీఐఐసీ ఛైర్మన్‌ రోజా, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తదితరులు పాల్గొన్నారు. 

అనంతరం ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ‘దిశ’ కార్యశాలలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘దిశ’ చట్టం ప్రత్యేకమైందని, చరిత్రలో నిలిచిపోతుందన్నారు. వెంటనే శిక్ష పడుతుందన్న భయం ఉంటేనే అఘాయిత్యాలను ఆపగలుగుతామన్నారు. నిర్భయ ఘటన జరిగి ఎనిమిదేళ్లైనా నిందితులకు ఇప్పటి వరకు శిక్ష అమలు కాలేదని అసహనం వ్యక్తం చేశారు. చిన్నారులు, మహిళలపై అత్యాచారం జరిగితే 7 రోజుల్లోపే దర్యాప్తు పూర్తి చేసి 21 రోజుల్లోనే నిందితుడికి శిక్షపడేలా చట్టం రూపొందించామని వివరించారు. ఈనెలాఖరుకల్లా 18 దిశ పోలీసు స్టేషన్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. 

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని