మాస్క్‌ ఇస్తే... జేబులో పెట్టుకున్నారు: కేటీఆర్‌
close
Published : 09/07/2020 01:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మాస్క్‌ ఇస్తే... జేబులో పెట్టుకున్నారు: కేటీఆర్‌

ఉపసభాపతి పద్మారావుకు కరోనాపై కేటీఆర్‌

కరీంనగర్‌: ఉపసభాపతి పద్మారావుకు కరోనా సోకడంపై  తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ ఆసక్తికర విషయం చెప్పారు. ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన సంచార వైద్యశాల వాహనాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పద్మారావుకు కరోనా సోకిన విషయం గురించి ప్రస్తావించారు. ఇటీవల ఓ కార్యక్రమంలో ఉపసభాపతి పద్మారావుకు తాను మాస్క్‌ ఇచ్చానని.. అయితే ఆయన ధరించకుండా జేబులో పెట్టుకున్నారని గుర్తు చేశారు. ‘ఏం కాదు హైదరాబాద్ వాళ్లం గట్టిగా ఉంటామ’ని పద్మారావు అన్నారని కేటీఆర్‌ చెప్పారు. ఇప్పుడు ఆయనకు కరోనా సోకిందని కేటీఆర్‌ అన్నారు. 

జాగ్రత్తలు పాటించడం మన కోసమే కాదు.. మన కుటుంబ సభ్యులకు రక్షణ కోసమని కేటీఆర్‌ తెలిపారు. కరోనా నుంచి రక్షణ పొందే విషయంలో ఎవరికి వారు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేటీఆర్‌ చెప్పారు. వైరస్​ నుంచి రక్షణ పొందే విషయంలో ఎవరికి వారు జాగ్రత్త వహించాలి అని కేటీఆర్‌ సూచించారు. కరోనా నుంచి రక్షణ కోసం సామాజిక మాధ్యమాల్లో ప్రతి ఒక్కరూ వైద్యులు అయిపోతున్నారని కేటీఆర్‌ సరదగా అన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని