కరోనా విషయంలో 4 ‘T’లు పాటించండి
close
Updated : 12/07/2020 21:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా విషయంలో 4 ‘T’లు పాటించండి

కరోనా పరీక్షలు చేయించుకున్న గవర్నర్‌

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రోజువారీ కరోనా పరీక్షల సంఖ్యను భారీగా పెంచింది. అందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరుతోంది. దీంతో చాలా మంది పరీక్షలు చేయించుకోవడం కోసం ఆస్పత్రులకు వెళ్తున్నారు. తాజాగా రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. రిపోర్టులో కరోనా నెగటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని గవర్నర్‌ స్వయంగా ట్విటర్‌ వేదికగా వెల్లడిస్తూ ప్రజలను సైతం ముందస్తు పరీక్షలు చేయించుకొని కరోనా బారిన పడకుండా జాగ్రత్త పడాలని కోరారు.

‘‘ఈ రోజు నేను కరోనా పరీక్షలు చేయించుకున్నా.. నెగటివ్‌గా తేలింది. రెడ్‌ జోన్లో ఉన్నవారు, కరోనా రోగులను కలిసిన వారు దయచేసి వీలైనంత తొందరగా కరోనా పరీక్షలు చేయించుకోండి. ముందస్తు పరీక్షలు చేయించుకోవడం వల్ల మనల్ని మనం కాపాడుకోవడమే కాదు.. ఎదుటివారిని కాపాడిన వాళ్లమవుతాం. ఏమాత్రం సంకోంచించకండి. మీరు పరీక్షలు చేయించుకొని.. ఎదుటివారిని ప్రోత్సహించండి. ముఖ్యంగా ‘4టీ’లను పాటించండి. టెస్ట్ ‌(పరీక్ష), ట్రేస్‌ (కరోనా వచ్చిన వారిని గుర్తించడం), ట్రీట్‌ (చికిత్స), టీచ్ (ఎదుటివారికి చెప్పడం)’’ అని గవర్నర్‌ తమిళిసై ట్వీట్‌లో పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. పలు ఆస్పత్రుల్లో కరోనా రోగులను, వైద్యులను కలిశారు. ప్రైవేటు ఆస్పత్రుల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు.

రాజ్‌భవన్‌లో కరోనా కలకలం 

తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తి రాజ్‌భవన్‌కు చేరింది. రాజ్‌భవన్‌లో 28 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. మరో 10 మంది సిబ్బందికీ పాజిటివ్‌గా తేలింది. రాజ్‌భవన్‌ సిబ్బంది కుటుంబీకుల్లో మరో 10 మందికి కరోనా పాజిటివ్‌గా తేలడం కలకలం రేపింది. రాజ్‌భవన్‌లో మొత్తం 395 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 347 మందికి నెగిటివ్‌గా తేలింది. మరోవైపు కరోనా పరీక్షల్లో గవర్నర్‌ తమిళి సై సౌందరాజన్‌, ఇతర సీనియర్‌ అధికారులకు నెగిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని