కరోనా ఎఫెక్ట్‌... చిన్నబోయిన ఎవరెస్ట్‌
close
Published : 28/02/2020 18:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా ఎఫెక్ట్‌... చిన్నబోయిన ఎవరెస్ట్‌

కాఠ్‌మాండు: కరోనా వైరస్‌ ఉద్ధృతి ఇప్పట్లో తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించటం లేదు. ఇప్పటి వరకు 50 దేశాలలో సుమారు 80 వేల మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. ప్రజల ఆరోగ్యం మీద మాత్రమే కాకుండా అనేక ఇతర రంగాలపైనా తన ప్రభావాన్ని చూపుతోంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్టుకూ కరోనా సెగ తగిలింది. ఎవరెస్టును అధిరోహించే వారి సంఖ్య ఈ సారి భారీగా తగ్గనుందనే అంచనాలు వెలువడుతున్నాయి. చైనాకు చెందిన సాహసికుల్లో అధికశాతం ఇప్పటికే తమ బుకింగ్‌లను రద్దు చేసుకున్నారు. ఇరాక్‌, దక్షిణ కొరియా, జపాన్‌, ఇటలీ వంటి ఐరోపా దేశాల నుంచి పర్వతారోహకులు ఎవరెస్టు అధిరోహణకు వచ్చే అవకాశాలు బలహీనంగా ఉన్నాయని నిర్వాహకులు అంటున్నారు. 

మార్చి నుంచి మే వరకు ఎవరెస్ట్‌ను ఎక్కేందుకు అనుకూలమైన సమయం. కాగా ఈ సంవత్సరం కోవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో... చైనా తన వైపున్న టిబెట్‌ మార్గాన్ని తెరిచే అవకాశం ఎలాగూ లేదు. ఎవరెస్టును అధిరోహించటానికి నేపాల్‌ వైపు నుంచి మాత్రమే అవకాశముంది. ఎవరెస్టును ఎక్కేందుకు నేపాల్‌ ప్రభుత్వం విదేశీ పర్యాటకుల నుంచి $11,000 మొత్తాన్ని, నేపాలీల నుంచి రూ.75,000ను వసూలు చేస్తుంది. ఇక 8,000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న ఇతర శిఖరాల అధిరోహణకు గానూ విదేశీయులు $1800, స్వదేశీయులు రూ.10,000 చెల్లించాలి. 

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ‘విజిట్‌ నేపాల్‌ 2020’ క్యాంపెయిన్‌లో పర్యాటకుల సంఖ్యలో ఇప్పటికే 2 శాతం తగ్గుదల చోటుచేసుకుంది. ఇక కొవిడ్‌-19 వ్యాప్తిని నిరోధించటానికి నేపాల్‌ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోకుంటే ఈ సీజన్లో అర్థిక పరంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొవాల్సి వస్తుందని నిర్వాహకులు అంటున్నారు. అంతేకాకుండా ఈ ప్రభావం దీర్ఘకాలం ఉండే అవకాశం ఉందని కూడా వారు అంచనా వేస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని