గల్వాన్‌ ఘటనపై అఖిలపక్ష భేటీకి 20 పార్టీలు!
close
Published : 19/06/2020 14:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గల్వాన్‌ ఘటనపై అఖిలపక్ష భేటీకి 20 పార్టీలు!

దిల్లీ: భారత్‌-చైనా సరిహద్దుల్లో పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు జరగనున్న అఖిలపక్ష భేటీకి 20 పార్టీలు హాజరుకానున్నట్లు సమాచారం. సాయంత్రం 5 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ భేటీ జరగనున్న విషయం తెలిసిందే. ఈ సమావేశానికి హోంమంత్రి అమిత్‌ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, భాజపా అధ్యక్షుడు జగత్‌ ప్రకాశ్‌ నడ్డా హాజరుకానున్నారు. ప్రధాని తరఫున రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్ని ప్రధాన పార్టీలకు స్వయంగా ఫోన్‌ చేసి ఆహ్వానించినట్లు సమాచారం.

ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌), ఆర్జేడీ వంటి పార్టీలకు ఆహ్వానం అందలేదన్న విమర్శలపై కేంద్రం వివరణ ఇచ్చినట్లు సమాచారం. గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు, లోక్‌సభలో ఐదుగురు ఎంపీల కంటే ఎక్కువ ఉన్న పార్టీలు, ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలు, కేంద్ర కేబినెట్‌లో చోటుదక్కిన పార్టీలను మాత్రమే సమావేశానికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది.  

తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయలో భారత్‌-చైనా మధ్య సోమవారం తీవ్ర ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. దీనిలో 20 మంది సైనికులు వీరమరణం పొందారు. దీంతో సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై పలు వర్గాల్లో ఆందోళన వ్యక్తమయింది. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్రం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. ప్రస్తుతం సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులు, ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించేందుకు సిద్ధమైంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని