జీన్స్‌ వేసుకుందని బాలికను కొట్టి చంపారు.. తాత, మామలే నిందితులు!
close
Published : 23/07/2021 10:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జీన్స్‌ వేసుకుందని బాలికను కొట్టి చంపారు.. తాత, మామలే నిందితులు!

ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం

దేవరియా (ఉత్తర్‌ప్రదేశ్‌): గ్రామంలో జీన్స్‌ వేసుకుని తిరుగుతోందన్న కారణంతో.. 17 ఏళ్ల బాలికను ఆమె తాత, ఇద్దరు మామలు కొట్టి చంపిన దారుణ ఉదంతమిది. ఉత్తర్‌ప్రదేశ్‌ దేవరియా జిల్లాలో ఈనెల 19న ఘటన జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహువాదీహ్‌ ప్రాంతంలోని గ్రామానికి చెందిన బాలిక.. కొన్నాళ్లుగా పంజాబ్‌లోని లుథియానాలో తల్లిదండ్రులతో కలిసి ఉండేది. ఆమె తండ్రి అక్కడే ఉద్యోగం చేసేవారు. ఆయన మృతి అనంతరం ఇటీవల తల్లితో కలిసి సొంత గ్రామానికి తిరిగొచ్చింది. బాలిక గ్రామంలో జీన్స్‌ ధరిస్తుండటం కుటుంబ పెద్దలకు ముఖ్యంగా తాత, మామలకు నచ్చడం లేదు. జీన్స్‌ వేసుకోవద్దని వారు చెప్పినా బాలిక వినలేదు. వారికి ఎదురు పడకుండా ఎక్కువ సమయం ఇంటి బయటే ఉంటూ వచ్చింది. దీనిపై సోమవారం బాలికకు, పెద్దలకు గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆమెను గోడకేసి కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతిచెందింది. అనంతరం మృతదేహాన్ని ఆటోలో తీసుకెళ్లి కాస్యా - పట్నా జాతీయ రహదారిపై ఓ వంతెన నుంచి కింద పడేశారు. అయితే మృతదేహం వంతెన గ్రిల్స్‌ మధ్యలో ఇరుక్కుని వేలాడటంతో ఇతర ప్రయాణికులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. విచారణలో అసలు విషయం బయటపడింది. ఈ కేసులో తాత పరమన్స్‌ పాసవాన్‌ను అరెస్టు చేయగా, మామలు వ్యాస్, అరవింద్‌ల కోసం గాలిస్తున్నారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని