అర్ధరాత్రి ఆమె కోసం... 100 కిలోమీటర్లు!
close
Published : 13/06/2020 00:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అర్ధరాత్రి ఆమె కోసం... 100 కిలోమీటర్లు!

బతుకుతెరువు కోసం ఆటో నడుపుతోంది మణిపుర్‌లోని పంగైయ్‌కు చెందిన ఎచీలైబీ ఒయ్‌నమ్‌. కరోనా బారినపడి కోలుకుని అర్ధరాత్రి హాస్పిటల్‌ నుంచి తన సొంత ఊరికి వెళ్లడానికి సిద్ధపడింది సొమిఛొన్‌ చిట్‌హంగ్‌ అనే యువతి. ఆ అర్ధరాత్రి ఇంఫాల్‌ నగరం నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఆమె సొంతూరికి తీసుకెళ్లడానికి ఒక్క అంబులెన్స్‌వాళ్లూ ఒప్పుకోలేదు. కారణం... ఎక్కడో కొండల్లో విసిరేసినట్టుగా ఉండే గ్రామంలో ఉంటుంది ఆమె ఇల్లు. ఆటోలో ఇంటి వరకు తీసుకెళ్లి రెట్టింపు సంపాదించవచ్చని ఆశపడలేదు ఎచీలైబీ. ఆ సమయంలో ఒంటరిగా ఉన్న ఆ యువతిని క్షేమంగా ఇంటికి చేర్చాలని మాత్రమే ఆలోచించింది. దాంతో ఆటోడ్రైవర్‌ ఎచీలైబీ స్వచ్ఛందంగా ముందుకొచ్చింది. ఆ సమయంలో మబ్బులు పట్టినా, ఆ యువతి సొంతూరు ప్రమాదభరితమైన పర్వత ప్రాంతంలో ఉన్నా ఎనిమిది గంటలపాటు ఆటో నడిపి ఆమెను సురక్షితంగా ఇంటికి చేర్చింది. ‘ఆమె ఎవరో నాకు తెలియకపోయినా ఆ సమయంలో నేనక్కడ ఉండటం మంచిదైంది’ అంటోంది ఎచీ. స్వార్థరహితంగా చేసిన ఈ సేవకుగానూ మణిపుర్‌ ముఖ్యమంత్రి బిరెన్‌సింగ్‌ చేతుల మీదుగా రూ.లక్షాపదివేల బహుమతిని అందుకుంది. అంతేకాదు ఈమె చేసిన మంచి పనిని ముఖ్యమంత్రి ఎంతగానో ప్రశంసించారు కూడా.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని