జలుబా.. ఇదిగో మిరియాల రసం
close
Published : 02/08/2020 02:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జలుబా.. ఇదిగో మిరియాల రసం

జలుబూ, దగ్గుతో ఏ కాస్త ఇబ్బందిపడ్డా వెంటనే మిరియాల పాలు తాగేస్తాం. అలాగే వీటితో రసాన్ని కూడా తయారుచేసుకోవచ్ఛు దీన్ని తీసుకుంటే జలుబూ, దగ్గుల నుంచే కాకుండా గొంతు నొప్పి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఎన్నో ఉపయోగాలున్న దీన్ని ఎలా చేయాలో చూద్దామా...

కావాల్సినవి: అర టీస్పూన్‌ మిరియాలు, పావుస్పూన్‌ జీలకర్రను బరకగా పొడిచేసి పెట్టుకోవాలి. పసుపు- పావుస్పూన్‌, బెల్లంపొడి- అర టీస్పూన్‌, పల్చటి చింతపండు రసం- పావుకప్పు, కొత్తిమీర- కొద్దిగా, నెయ్యి- టీస్పూన్‌, టొమాటో- ఒకటి (మెత్తగా పేస్టు చేసి పెట్టుకోవాలి).

పోపుకోసం: కొద్దిగా ఆవాలు, ఎండుమిర్ఛి

తయారీ: గిన్నెలో రెండు గ్లాసుల నీళ్లు పోసి దీంట్లో టొమాటో పేస్టు, చింతపండు రసం, పసుపు, మిరియాలు, జీలకర్ర, బెల్లంపొడి, సరిపడా ఉప్పు వేసి కాసేపు మరగనివ్వాలి. ఇలా మరుగుతుండగానే ఇంగువ, కొత్తిమీర తురుము వేసి కాసేపు చిన్నమంట మీద ఉంచాలి. కడాయిలో నెయ్యి వేసి వేడిచేసి ఆవాలు, ఎండుమిర్చి వేసి చిటపటలాడగానే రసంలో కలపాలి. దీన్ని వేడివేడి అన్నంలో వేసుకుని తింటే గొంతు నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్ఛుమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని