ఆది నుంచే నేర్పండి!
close
Published : 30/09/2020 00:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆది నుంచే నేర్పండి!

చిన్నప్పటి నుంచే పిల్లలకు మంచి లక్షణాలను, సత్ప్రవర్తనను అలవాటు చేయాలి. అందుకోసం మీరేం చేయాలంటే...
మొదటి మార్గదర్శి మీరే! పిల్లలకు మంచి పద్ధతులు నేర్పాలంటే... అమ్మగా మీరూ వాటిని మొదట ఆచరిస్తే... చిన్నారి మిమ్మల్ని అనుసరిస్తుంది. ఉదాహరణకు పెద్దగా మాట్లాడొద్దని చిన్నారికి చెప్పి ఇతరులపై మీరు అరిస్తే... తనకు ఎలా ఉండాలో అనేది అర్థం కాదు. కాబట్టి తనకు చెప్పే ముందు మీరు దాన్ని కచ్చితంగా ఆచరించండి.
సానుకూలతే సాధనంగా... మీరు చిన్నారికి ఏం చెప్పాలనుకున్నా అనునయంగా చెప్పాలి. అప్పుడే అవి వారి మెదడులో స్థిరపడతాయి. దాంతో చిన్నప్పటి నుంచే ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉంటారు. ఉదాహరణకు పరుగెత్తే అమ్మాయిని... ‘ అలా వేగంగా పరుగెత్తితే కాళ్లు విరుగుతాయి’ అని చెప్పే బదులుగా ‘మెల్లగా, జాగ్రత్తగా వెళ్లు’ అని చెబితే సరిపోతుంది. ముఖ్యంగా చిన్నారులకు వారు చేయకూడనివి కంటే ఏం చేయాలనే విషయం స్పష్టంగా చెప్పగలగాలి. అప్పుడే కొత్త విషయాలు ఉత్సాహంగా నేర్చుకుంటారు.
మనస్ఫూర్తిగా మెచ్చుకోండి... చిన్నారి చెప్పిన పని చక్కగా పూర్తిచేసినప్పుడు బాగా చేశావంటూ మెచ్చుకోవాలి. అది ముక్తసరిగా కాకుండా మనస్ఫూర్తిగా మెచ్చుకోవాలి. దీనివల్ల వారిలో ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం పెరుగుతాయి. కొత్తపని చేయాలన్న ఉత్సాహం వస్తుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని