చెప్పింది మరచిపోతున్నారా!
close
Published : 16/11/2020 01:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చెప్పింది మరచిపోతున్నారా!

లక్కీ చాలా చురుకైందే గానీ  టీచర్‌ చెప్పిన విషయాలను వెంటనే మర్చిపోతుంటుంది. చాలామంది పిల్లలు ఇలాంటి సమస్యతోనే ఇబ్బందిపడుతుంటారు. అలాకాకూడదంటే వీటిని పాటించి చూడండి!
విన్న విషయాన్ని బాగా అర్థం చేసుకుంటే మర్చిపోయే అవకాశమే ఉండదు. కాబట్టి ముందుగా మీరు చెప్పిన విషయం వాళ్లకు ఎంతవరకు అర్థమైందో తెలుసుకోవాలి. దానికోసం మధ్యమధ్యలో ప్రశ్నలు వేస్తుండాలి. అప్పుడు వాళ్లకు అర్థంకాని విషయాన్ని మళ్లీ వివరంగా చెప్పొచ్చు.
* నేర్పబోయే అంశాన్ని చిన్న పాట లేదా పద్యం రూపంలో చెబితే పిల్లలు త్వరగా ఒంటపట్టించుకుంటారు.  నేర్చుకోవాల్సిన సమాచారానికి సంబంధించిన బొమ్మలు లేదా వీడియోలను చూపిస్తున్నా కూడా గుర్తుంచుకోగలుగుతారు.
* పిల్లలను అప్పుడప్పుడూ గ్రంథాలయాలు, మ్యూజియం లేదా ఆర్ట్‌ గ్యాలరీలకు తీసుకెళ్లాలి. స్వయంగా చూసి నేర్చుకున్న విషయాలు చిన్నారుల మనసులో గాఢమైన ముద్ర వేస్తాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని