నెట్‌వర్కింగ్‌ కోసం..!
close
Published : 26/03/2016 01:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నెట్‌వర్కింగ్‌ కోసం..!

నెట్‌వర్కింగ్‌ కోసం..!

ఒక్క కార్పొరేట్‌ ఉద్యోగాల్లోనే కాదు.. ఇప్పుడన్నిచోట్లా వినిపిస్తున్న మాట నెట్‌వర్కింగ్‌! సంస్థ లోపలా బయటా మనకంటూ ఏ సాయమైనా చేసిపెట్టగల స్నేహితులూ, పరిచయస్తులతో కూడిన ‘మైత్రీవ్యవస్థే’ ఇది! అది సొంతం చేసుకోవాలంటే...

చాయ్‌ పే చర్చ : మీరో సంస్థలో చేరాక చిన్నాపెద్దా అని తేడా లేకుండా అందరితోనూ మాట్లాడండి. మనకంటే చిన్నవాళ్లూ, తోటివారితో ఇట్టే కలిసిపోగలం కానీ.. పై అధికారులతో ఎలాగంటారా? ‘పనికి సంబంధించి ఫలానా సమస్యపై సలహాలు కావాలి’ అని కొంత సమయం కేటాయించమని అడగండి. ఒప్పుకుంటారు. చక్కగా టీ తాగుతూ వాళ్ల అనుభవాలూ తెలుసుకోవచ్చు. మీరు నిర్దేశించుకోవాల్సిన లక్ష్యాలూ, వాటికోసం అందుకోవాల్సిన మైలురాళ్లు వంటివి ప్రస్తావించండి.

ద్వేషాలొద్దు.. : ఒకచోట కలిసి పనిచేస్తున్నప్పుడు ఎన్నో అభిప్రాయభేదాలు వస్తుంటాయి. వాటన్నింటినీ వ్యక్తిగత ద్వేషంగా మార్చుకోవద్దు. అది మీ పని సామర్థ్యంపైనే కాదు.. నెట్‌వర్కింగ్‌పైనా తీవ్ర ప్రభావం చూపుతుంది. మీరు ఓ చోట నుంచి బయటకు వెళుతున్నారంటే.. వాళ్లందరూ మీ గురించి ఆనందంగా నెమరేసుకోవాలి! పువ్వులు తీశాకా గిన్నె పరిమళిస్తుంది కదా.. అలా ఉండాలి మీ జ్ఞాపకం వారిలో! వాళ్లందరూ మీ నెట్‌వర్క్‌లో అలా భాగమైపోతారు!!

బయటివారితోనూ.. : మన వృత్తికి అతీతంగా అప్పుడప్పుడూ తారసపడే వ్యక్తులతోనూ సత్సంబంధాలు నెరపండి. మీ అభిరుచులూ, ఆలోచనలూ, జీవిత దృక్పథాన్ని పంచుకుంటూ ఉండండి. అవసరమైనప్పుడు అనుకోకుండా వీళ్ల నుంచి ఎంతో కొంత సాయం అందుతుంది. మన వృత్తుల్ని మార్చుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి పరిచయాలు ఎంతో మేలుచేస్తాయి.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని