తల్లుల ఖాతాల్లో రూ.73.52 కోట్లు
close
Updated : 30/07/2021 11:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తల్లుల ఖాతాల్లో రూ.73.52 కోట్లు


చెక్కును అందిస్తున్న మంత్రులు సుచరిత, వనిత, ఎమ్మెల్యేలు ముస్తఫా, గిరిధర్‌రావు, కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌, మేయర్‌ మనోహర్‌నాయుడు

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: చదువుకు పేదరికం అడ్డు కాకూడదని దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రవేశపెట్టారని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. జగనన్న విద్యాదీవెన రెండో విడత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. గుంటూరు కలెక్టరేట్‌ నుంచి కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హోంమంత్రితో పాటు, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత వీక్షించారు. ఈసందర్భంగా హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత విద్యాదీవెన నిధులను విద్యార్థుల తల్లి పేరున ఖాతాల్లో వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ విద్యార్థులు చదువుకు ఇబ్బందులు పడకూడదని సీఎం జగన్‌ వంద శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. జిల్లా కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ మాట్లాడుతూ జగనన్న విద్యా దీవెన పథకంలో భాగంగా రెండో విడత జిల్లాలో 99,441 మంది విద్యార్థులకు 88,495 మంది తల్లుల ఖాతాల్లో రూ.73.52 కోట్లు జమైనట్లు తెలిపారు. గుంటూరుకు చెందిన విద్యార్థిని తల్లి పి.అంజనాదేవి సీఎంతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. వీసీలో నగర మేయర్‌ కావటి మనోహర్‌నాయుడు, ఎమ్మెల్యేలు మద్దాళి గిరిధర్‌రావు, ముస్తఫా, ఏఎన్‌యూ ఉపకులపతి పి.రాజశేఖర్‌, రెక్టార్‌ పి.వరప్రసాదమూర్తి, రిజిస్ట్రార్‌ కె.రోశయ్య, సాంఘిక సంక్షేమ శాఖ డిడీ మధుసూదన్‌, బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్‌ కల్పనాబేబి తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని