లిప్‌స్టిక్‌ ఒక్కటే... కానీ!
close
Published : 18/09/2021 01:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లిప్‌స్టిక్‌ ఒక్కటే... కానీ!

అందంగా ముస్తాబవడం అంటే అమ్మాయిలకు చాలా ఇష్టం. ఇందులో భాగంగా మేకప్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఒక్కోసారి సమయం తక్కువగా ఉంటుంది లేదా అన్ని సౌందర్య ఉత్పత్తులూ అందుబాటులో ఉండవు. అలాంటప్పుడు ఉన్న లిప్‌స్టిక్‌నే ఆల్‌ ఇన్‌ వన్‌గా వాడొచ్చు. దీన్ని ఉపయోగించి కొన్ని నిమిషాల్లో ఆకర్షణీయమైన లుక్‌ను సొంతం చేసుకోవచ్చు. ఎలా అంటే..

కన్సీలర్‌గా... కంటి కింద వలయాలు అందాన్ని తగ్గిస్తాయి. ఇలాంటప్పుడు లిప్‌స్టిక్‌నే కన్సీలర్‌గా వాడి చూడండి. కాస్తంత లిప్‌స్టిక్‌ను చేత్తో తీసుకుని కళ్లకింద మృదువుగా రాయండి. అపైన ఫౌండేషన్‌ వేస్తే సరి.  

ఐషాడోగా... కొద్దిగా లిప్‌స్టిక్‌ను కనురెప్పలపై రాయాలి. ఆ తర్వాత మస్కారా, ఐలైనర్‌ వేసుకోవాలి. ఇలా చేస్తే  నిమిషాల్లోనే అందమైన, ఆకర్షణీయమైన  ఐ మేకప్‌ మీ సొంతమవుతుంది.

బ్లష్‌లా... దీన్ని బుగ్గలకు బ్లష్‌లానూ వాడొచ్చు. కాస్తంత లిప్‌స్టిక్‌ను చెంపలపై రాసుకోవాలి. ఎరుపు, గులాబీ, పీచ్‌, ఆరెంజ్‌ రంగులనూ వాడి చూడండి. అందం రెట్టింపవడం ఖాయం.

హైలైటర్‌గా... ముదురు గోధుమ రంగు లిప్‌స్టిక్‌ను హైలైటర్‌గా ముఖానికి వేసి చూడండి. కాస్త ఎక్కువ    మొత్తంలో వాడితే మరింత   ఆకర్షణీయంగా కనిపిస్తారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని