తిండికీ ఓ పద్ధతి!
close
Updated : 15/06/2021 05:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తిండికీ ఓ పద్ధతి!

ఆరోగ్యం కోసం చాలామంది ఆహారంపై దృష్టిపెడుతుంటారు. కానీ అది మాత్రమే సరిపోదంటున్నారు నిపుణులు. మరేం చేయాలంటారా?
టీవీ చూసేటప్పుడు చిరుతిండి తినడం చాలామందికి అలవాటు. దాని ధ్యాసలోపడి తెలియకుండానే ఎక్కువగా తినేస్తుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. పనిచేస్తూ, డ్రైవింగ్‌లో, ఆఖరికి నడిచేటప్పుడూ తినొద్దట. తెలియకుండానే ఎక్కువ తినేసే అవకాశముంటుందట.
* తినే ప్రతిదాన్నీ కెలొరీల లెక్కలేసుకోవద్దు. ఇది ఆహారంపై అయిష్టతకి కారణమవుతుంది. అలా కాకుండా మీ శరీరానికి ఏం కావాలో, ఎంత కావాలో తెలుసుకుని, తీసుకోండి. ఈ విషయంలో నిపుణుల సలహా తీసుకోవడం మేలు.
* ఒత్తిడి, బాధలో ఉన్నపుడూ తిండివైపు మొగ్గుతుంటారు కొందరు. ఏవి తింటున్నారో, ఎంత తింటున్నారో మర్చిపోతుంటారు. ఇలాంటప్పుడు తిండి కాకుండా మనసును కుదుటపరిచే వేరే ప్రత్యామ్నాయాలను చూడాలి.
* డైట్‌లో ద్రవాలకూ ప్రాధాన్యమివ్వాలి. కానీ వాటిపైనే ఆధారపడొద్దు. తొందరగా జీర్ణమై ఆకలేస్తుంటుంది. అవి ఆకలిని కాసేపు ఆపినా.. శరీరానికి అవసరమైన పోషకాలు లభించవు.
* దేనికైనా త్వరిత ఫలితం కావాలంటారు చాలామంది. అందుకే వెంటనే డైట్‌ మార్చేస్తుంటారు. ఇదీ మంచి పద్ధతి కాదు. ఒక విధానానికి శరీరం అలవాటు పడి ఫలితాన్నివ్వడానికి కొంత సమయం పడుతుంది. వేచి చూడాల్సిందే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని