నువ్వూ...నేనూ... మనం!
close
Published : 04/04/2021 02:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నువ్వూ...నేనూ... మనం!

ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగాలు...ఆలుమగల మధ్య ఉండే సమయాన్ని తగ్గిస్తున్నాయి. ఫలితంగా చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద సమస్యలూ అల్లుకుపోతున్నాయి. వాటిని అధిగమించాలంటే...
* భార్యాభర్తల బంధంలో ప్రేమాభిమానాలే కాదు ఒకరంటే మరొకరికి బాధ్యతా అవసరమే. రోజువారీ జీవనశైలిలో భాగంగా అవసరమయ్యే చిన్నపనులూ కావొచ్చు. మనసు విప్పి చెప్పినప్పుడు ఎదుటివారికి అర్థమవుతుంది. ‘భోజనం చేశావా’ అని చేసే చిన్న ఫోన్‌ కాల్‌. ‘నువ్వు నీరసంగా ఉన్నావు కదా! ఈ రోజు నేను వెళ్లి కూరగాయలు తీసుకొస్తాను’ అనడం వంటివన్నీ ఈ తరహానే.
* దంపతులన్నాక గిల్లికజ్జాలు, చిరు పోట్లాటలు సహజం. అయితే వాటిని పెద్దవి చేసుకోవద్దు.  ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుంది. ఒకరు ప్రశ్నిస్తుంటే....మౌనంగా ఉండటం వల్ల గొడవ సద్దుమణిగిపోతుందనుకోవడం పొరబాటే. దానివల్ల కొన్నిసార్లు అవతలివారు మనల్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారేమో అన్న సందేహమూ తలెత్తుతుంది. వాదనలకు దిగకుండా సామరస్యంగా  మాట్లాడుకునే మాటలే మీ గొడవకు ముగింపు పలుకుతాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని